కోల్‌కతాను చిత్తుగా ఓడించిన ధోని సేన

కోల్‌కతాను చిత్తుగా ఓడించిన ధోని సేన
  • లాస్ట్ సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన ధోని సేన

చెప్పినట్టే ఈసారి గట్టిగా కొట్టింది ధోని సేన. లాస్ట్ సీజన్‌లో అట్టడుగు స్థానంతో నిరాశపరిచిన సూపర్ కింగ్స్... ఈసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఫైనల్ ఫైట్‌లో కోల్‌కతాను చిత్తుగా ఓడించి... నాలుగో ట్రోఫీని అకౌంట్లో వేసుకుంది. చెన్నై విజయంలో డుప్లెసిస్, జడ్డూ కీ రోల్ పోషించారు.

ఆల్ రౌండ్ ప్రదర్శనతో నాలుగో IPL ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది ధోనీ సేన. 14వ సీజన్ ఫైనల్ ఫైట్ లో కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఈజీగా గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో మూడు వికెట్లకు 192 పరుగుల భారీ స్కోరు చేసింది. చేజింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసింది. దీంతో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది సీఎస్కే.

ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ చెన్నైకి అద్దిరిపోయే స్టార్ట్ అందించారు. వీరిద్దరు ఫస్ట్ వికెట్ కు 61 రన్స్ పార్ట్‌నర్ షిప్ చేశారు. డుప్లెసిస్ హాఫ్ సెంచరీతో మాస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. రుతురాజ్  ఔటైనా తర్వాత వచ్చిన ఉతప్ప, మొయిన్ అలీ... సిక్సర్లతో కేకేఆర్‌కు చుక్కలు చూపించారు. ఉతప్ప 15బాల్స్‌లో 3సిక్సర్లతో 31 రన్స్ చేశాడు. మొయిన్ అలీ 20 బాల్స్ లో 3సిక్సర్లతో 37 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

డుప్లెసిస్ నైట్ రైడర్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఏమాత్రం గ్యాప్ దొరికినా బాల్‌ను స్టాండ్స్‌లో డిపాజిట్ చేశాడు. చూడచక్కని షాట్స్‌తో వండర్ ఫుల్ నాక్ ఆడాడు. ఓపెనింగ్ వచ్చి చివరిబాల్ వరకు ఉన్నాడు. 7ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు డుప్లెసిస్. డుప్లీ అద్దిరిపోయే ఇన్నింగ్స్ కు ఉతప్ప మొయిన్‌ల మెరుపులు తోడవడంతో 192 పరుగుల భారీ స్కోరు చేసింది చెన్నై.

ఛేజింగ్ దిగిన కోల్‌కతాకు కూడా అద్దిరిపోయే ఆరంభం దక్కింది. శుభ్ మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫస్ట్ వికెట్ కు 91 రన్స్ పాట్నర్ షిప్ చేశారు. పదోవర్లకే వికెట్ నష్టపోకుండా 90 పరుగులు పూర్తవడంతో... కేకేఆర్ ఈజీగా గెలుస్తుందేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే వెంకటేష్ అయ్యర్ ఔటయ్యాడో నైట్ రైడర్స్ పతనం మొదలైంది.

51 రన్స్ చేసిన అయ్యర్... స్కోరు 91 పరుగులు ఉండగ పెవిలియన్ చేరాడు. ఇక అక్కడ మొదలైన వికెట్ల పతనం చివరివరకు ఆగలేదు. అయ్యర్ తర్వాత వచ్చిన నితీశ్ రానా డకౌట్ అయ్యాడు. నరైన్ రెండు పరుగులే చేశాడు. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చినవాళ్లంతా తేలిపోయారు. దినేష్ కార్తిక్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. షకీబ్ ఖాతా తెరవలేదు. రాహుల్ త్రిపాఠి 2 పరుగులే చేశాడు. కెప్టెన్ మోర్గాన్ 4 పరుగులతో మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. చివర్లో శివంమావీ, ఫెర్గుసనవ్ సిక్సులతో మెరిసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 90 పరుగులతో వికెట్ పోకుండా బలంగా కనిపించిన కేకేఆర్... ఇంకో 35 పరుగులకే ఏకంగా 8వికెట్లు పోగొట్టుకుంది.

కోల్‌కతా బౌలర్లలో నరైన్‌కు తప్పా మిగతావాళ్లందరు తేలిపోయారు. నరైన్ 4 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టాడు. కేవలం 26 పరుగులే ఇచ్చాడు. శివమ్ మావీ ఇటు బాల్ అటు బ్యాట్ తో ఫరవాలేదనిపించాడు. ఓ వికెట్ తీసిన మావీ... 20 పరుగులు చేశాడు. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, హేజిల్ వుడ్ 2, రవీంద్ర జడేజా 2, చాహర్, బ్రావో చెరో వికెట్ తీశారు.

మ్యాన్  ఆఫ్  ద మ్యాచ్  డుప్లెసిస్  అందుకున్నాడు. సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్  గైక్వాడ్ 635 పరుగులతో సీజన్ టాప్  స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్  దక్కించుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ గానూ రుతురాజ్ ఎంపికయ్యాడు. డుప్లెసిస్ 633 పరుగులతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. అత్యధిక వికెట్లు పడగొట్టే పర్పల్ క్యాప్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అందుకున్నాడు. హర్షల్ ఈ సీజన్‌లో 32 వికెట్లు తీశాడు.