ఓట‌మిపై ర‌జినీకాంత్ డైలాగ్ : దేవుడు శాసించాడు.. మేం ఓడిపోయాం

ఓట‌మిపై ర‌జినీకాంత్ డైలాగ్ : దేవుడు శాసించాడు.. మేం ఓడిపోయాం

గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై అనూహ్యంగా విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు కావాల్సిన సమయంలో సర్ రవీంద్ర జడేజా.. ఫోర్, సిక్స్ బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సింది. ఈ ఓటమిపై టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా స్పందించాడు. గెలుపు కోసం చివరి వరకు పోరాడామని తెలిపిన అతడు, ఇది విధి ఆడిన నాటకమని పేర్కొన్నాడు. 

"ఓటమికి కారణాలు ఇవే అన్నట్లుగా నేను సాకులు చెప్పను. మా జట్టును చూసి గర్వపడుతున్నా.. విజయం కోసం ఆఖరి వరకు పోరాడామా? లేదా? అన్నదే మాకు ముఖ్యం. కలిసి గెలుస్తాము.. కలిసి ఓడతాము అన్నది మా జట్టు నినాదం. చెన్నై మాకంటే మెరుగైన క్రికెట్ ఆడింది. విజయం సాధించింది. వారు సాధించిన ఈ విజయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా..'

'ధోని అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలిసిన అత్యుత్తమ వ్యక్తులలో అతనొకరు. ధోని భాయ్‌ని ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నేను ఒకవేళ ఓడిపోవాల్సి వస్తే అదీ ధోని చేతిలో అయితే అస్సలు బాధపడను..' అని పాండ్యా తెలిపాడు. 

నిజానికి ఆఖరి ఓవర్ నాలుగు బంతులయ్యే దాకా విజయం గుజరాత్‌వైపే ఉంది. మోహిత్ శర్మ వేసిన 20వ ఓవర్‌లో మొదటి బంతికి పరుగులు రాలేదు. ఆపై రెండో బంతికి సింగిల్ రాగా.. మూడో బంతికి కూడా ఒక్క పరుగే వచ్చింది. ఇక నాలుగో బంతికి కూడా సింగిల్ మాత్రమే రావడంతో చివరి 2 బంతుల్లో సీఎస్‌కే విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి. అంత ఒత్తిడిలోనూ ఐదో బంతికి స్ట్రైయిట్ సిక్సర్ బాదిన జడేజా, ఆఖరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు. దీంతో చెన్నై ట్రోఫీని ఎగరేసుకుపోయింది.