సన్‌‌‌‌రైజర్స్ హైదరాబాద్‌‌‌‌, ముంబై ఇండియన్స్‌‌‌‌ మధ్య ఆసక్తికర సమరం

సన్‌‌‌‌రైజర్స్ హైదరాబాద్‌‌‌‌, ముంబై ఇండియన్స్‌‌‌‌ మధ్య ఆసక్తికర సమరం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో  ఓడి వరుసగా రెండు విజయాలతో జోరు పెంచిన సన్‌‌‌‌రైజర్స్ హైదరాబాద్‌‌‌‌, ముంబై ఇండియన్స్‌‌‌‌ మధ్య ఆసక్తికర సమరానికి తెరలేవనుంది.  చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్న ఇరు జట్లు ఉప్పల్‌‌‌‌లో మంగళవారం జరిగే మ్యాచ్‌‌‌‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాజస్తాన్‌‌‌‌, లక్నో చేతిలో ఓటమి తర్వాత సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ బలంగా పుంజుకుంది.

సొంతగడ్డపై పంజాబ్‌‌‌‌ పై విజయాల ఖాతా తెరిచిన హైదరాబాద్‌‌‌‌ గత పోరులో ఈడెన్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో కోల్‌‌‌‌కతాపై అద్భుత విక్టరీ సాధించింది. బౌలర్లు పుంజుకోగా... బ్యాటింగ్‌‌‌‌లోనూ రైజర్స్‌‌‌‌ ఎంతో మెరుగైంది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్‌‌‌‌ ఈడెన్‌‌‌‌లో సూపర్ సెంచరీతో చెలరేగడంతో హైదరాబాద్‌‌‌‌ దుర్బేధ్యంగా మారింది. అదే జోరుతో ముంబై పనిపట్టి హ్యాట్రిక్‌‌‌‌ విజయంతో ముందుకెళ్లాలని కెప్టెన్‌‌‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ కోరుకుంటున్నాడు. మరోవైపు ముంబై కూడా అదే టార్గెట్‌‌‌‌ పెట్టుకుంది. ఆరంభ మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన రోహిత్‌‌‌‌సేన గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఢిల్లీ, కేకేఆర్‌‌‌‌పై నెగ్గింది. ముఖ్యంగా కేకేఆర్‌‌‌‌పై విక్టరీ ఆ టీమ్‌‌‌‌లో కాన్ఫిడెన్స్‌‌‌‌ నింపింది. ఇషాన్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మకు తోడు సూర్యకుమార్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావడం ముంబై క్యాంప్‌‌‌‌లో మరింత జోష్‌‌‌‌ నించింది.  .