ఆటగాళ్లకు షాకిచ్చిన కేకేఆర్, ఎంఐ..చెన్నైతోనే జడేజా

ఆటగాళ్లకు షాకిచ్చిన కేకేఆర్, ఎంఐ..చెన్నైతోనే జడేజా

ఐపీఎల్ 2023 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. నవంబర్ 15లోగా ఆటగాళ్ల రిటెన్షన్, ప్లేయర్ల రిలీజ్ లిస్టును వెల్లడించాలని బీసీసీఐ ఆదేశించడంతో... 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. ఇందులో భాగంగా కోల్కతా టీమ్ 16 మందిని రిలీజ్ చేయగా..ముంబై ఇండియన్స్ 13 మంది ప్లేయర్లను వదిలేసింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో సహా 12 మందిని మినీ వేలంలోకి రిలీజ్ చేసింది. 

గుజరాత్‌ టైటాన్స్లో హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), శుభమన్ గిల్,  మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్, వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , విజయ్ శంకర్,  షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్లను జట్టు రిటైన్ చేసుకుంది.  రహ్మనుల్లా గుర్బాజ్,  ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్లను గుజరాత్ మినీ వేలంలోకి విడుదల చేసింది. 

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిషబ్ పంత్ (కెప్టెన్‌),  వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్,  పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తఫిజర్‌ రెహ్మన్‌, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దుబే, విక్కీ ఓస్త్వాల్లను రిటైన్ చేసుకుంది.  శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్లను వదిలేసింది. 

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో  సంజు శాంసన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, హెట్మెయర్,  పడిక్కల్, బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, బౌల్ట్, మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, అశ్విన్, చాహల్ లను జట్టులోనే కొనసాగించింది. అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకాలను విడిచిపెట్టింది. 

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్ రిటైన్‌ లిస్ట్‌లో  శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, రస్సెల్,  నరైన్, ఉమేష్, సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్ ఉండగా..శార్దూల్ ఠాకూర్, ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్లను ట్రేడింగ్ చేసి దక్కించుకుంది. ఇక  కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే,  ఫించ్, హేల్స్, అభిజీత్ తోమర్, రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్లను రిలీజ్ చేసింది. 

పంజాబ్‌ కింగ్స్‌  రిటైన్‌ జాబితాలో ధావన్ (కెప్టెన్‌), షారుఖ్ ఖాన్, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్,  లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బిఆర్ ఉన్నారు. రిలీజ్ జాబితాలో మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ చేరారు.

బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), కోహ్లీ, ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, మాక్స్‌వెల్, హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్, సిరాజ్, హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్లను రిటైన్ చేసుకుంది.  జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్లను ఆర్సీబీ విడుదల చేసింది.

సన్‌రైజర్స్ జట్టు ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీలను కొనసాగించింది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ లను విడిచిపెట్టింది. 

ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్ లను రిటైన్ చేసుకోగా...పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్,  థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్,  ఉనద్కట్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్,  సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ లను విడుదల చేసింది. 

లక్నో టీమ్ కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), ఆయుష్ బదోని,  మనన్ వోహ్రా, డికాక్, స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, హుడా, కైల్ మేయర్స్, కృనాల్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ లను జట్టులోనే కొనసాగించింది. ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ లను విడుదల చేసింది. 

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్  ఎంఎస్ ధోని (కెప్టెన్‌), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దుబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్‌, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణలను రిటైన్ చేసుకుంది.  బ్రావో, ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్ లను మినీ వేలంలోకి రిలీజ్ చేసింది. 

ఏ జట్టు దగ్గర ఎంత అమౌంట్ ..?
రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర అత్యధికంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి.  పంజాబ్ కింగ్స్ దగ్గర రూ.  32.2 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర రూ.23.35 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ.20.55 కోట్లు, చెన్నై రూ. 20.45 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 19.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.19.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.13.2 కోట్లు, బెంగుళూరు రూ.8.75 కోట్లు, కోల్ కతా దగ్గర రూ. 7.05 కోట్లు ఉన్నాయి. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో ఫ్రాంచైజీలు తమ దగ్గర ఉన్న డబ్బుతో ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి.