90 మీటర్ల మార్క్ కంటే పతకమే ముఖ్యం: నీరజ్ చోప్రా

90 మీటర్ల మార్క్ కంటే పతకమే ముఖ్యం: నీరజ్ చోప్రా

గ్లాస్గో: ప్రతిసారీ 90 మీటర్ల మార్క్‌‌ను అందుకోవాలని తాను ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదని, పతకం గెలవడమే ముఖ్యమని భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా అన్నాడు. ఏ చాంపియన్‌‌షిప్‌‌లోనైనా తన మొదటి ప్రాధాన్యత పతకం సాధించడమేనని, దూరం అనేది రెండో ప్రాధాన్యత అని తెలిపాడు. 

పాకిస్తాన్ ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్, శ్రీలంక డైమండ్ లీగ్ విజేత రమేశ్ పతిరాగే వంటి అథ్లెట్లతో దక్షిణాసియాలో పోటీ చాలా పెరిగిందని చెప్పారు. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌‌లో స్వర్ణం గెలిచిన నీరజ్.. గాయం కారణంగా 2022 బర్మింగ్‌‌హామ్ క్రీడలకు దూరమయ్యాడు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కామన్వెల్త్ గేమ్స్ బరిలోకి దిగుతుండడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశాడు.