కెనడాలో భారీ డ్రగ్స్ దందా.. 11 మంది భారతీయ డ్రైవర్ల అరెస్ట్

కెనడాలో భారీ డ్రగ్స్ దందా.. 11 మంది భారతీయ డ్రైవర్ల అరెస్ట్

టొరంటో: కెనడాలోని ఒంటారియోలో అంతర్జాతీయ సరిహద్దు మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను అధికారులు ఛేదించారు. 'ప్రాజెక్ట్ బే' పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌‌‌‌లో రూ.1,390 కోట్ల విలువైన 1.7 టన్నుల డ్రగ్స్‌‌‌‌ను సీజ్ చేసినట్లు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్‌‌‌‌ఏ) వెల్లడించింది. ఒంటారియో చరిత్రలో ఒకేసారి ఈ స్థాయిలో డ్రగ్స్ దొరకడంఇదే మొదటిసారి. 

అమెరికా–కెనడా మధ్య కమర్షియల్ ట్రక్కుల ద్వారా కొకైన్, మెథాంఫెటమైన్, అఫియుమ్ స్మగ్లింగ్ చేస్తున్న 22 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపి 19 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో గగన్‌‌‌‌దీప్‌‌‌‌ థిండాల్‌‌‌‌, సిమ్రన్‌‌‌‌జిత్‌‌‌‌ సింగ్‌‌‌‌, కన్వర్‌‌‌‌పాల్‌‌‌‌ కులార్‌‌‌‌, జతిందర్‌‌‌‌పాల్‌‌‌‌ సింగ్‌‌‌‌, జస్విందర్‌‌‌‌ సోహి, తేజిందర్‌‌‌‌ సంధు, హర్జిందర్‌‌‌‌ సంధు, తర్మిందర్‌‌‌‌ సింగ్‌‌‌‌, గుందీప్‌‌‌‌ తరివాల్‌‌‌‌, మెహక్‌‌‌‌ ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌, కరణ్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ సహా 11 మంది భారతీయ సంతతికి చెందిన డ్రైవర్లు ఉన్నారు.