IPL 2024 : ధోనీ ఔట్.. చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

IPL 2024 : ధోనీ ఔట్.. చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా తన ప్రస్థానాన్ని ముగించాడు. ఐపీఎల్ కు ముందు కెప్టెన్ నుంచి తప్పుకొని షాక్ ఇచ్చాడు. 2008 లో చెన్నై జట్టు బాధ్యతలు తీసుకున్న ధోనీ ఇప్పటివరకు  అదే ఫ్రాంచైజీ తరపున ఆడారు. మధ్యలో రెండు సంవత్సరాలు చెన్నై జట్టును నిషేధించడంతో రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ తరపున ఆడాడు. ఎంఎస్ ధోని స్థానంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఈ విషయాన్ని ధృవీకరించింది.

2023 సీజన్ లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై రికార్డ్ స్థాయిలో 5 వ సారి టైటిల్ గెలుచుకుంది. గైక్వాడ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గా ఆడుతున్నాడు. కొన్ని సీజన్ లుగా జట్టులో నిలకడగా రాణిస్తున్న గైక్వాడ్ పైనే చెన్నై యాజమాన్యం నమ్మకముంచింది. అనుభవమున్న జడేజా ఉన్నా అతను గతంలో చెన్నై జట్టును సరిగా నడిపించలేకపోయాడు. ధోనీ కెప్టెన్ గా తప్పుకోవడంతో అతనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

2008 లో తొలిసారి రూ. 6 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. తొలి ప్రయత్నంలో ఫైనల్ కు తీసుకెళ్లినా ట్రోఫీ అందించలేకపోయాడు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ధోనీ కెప్టెన్సీలో చెన్నై 2010, 2011,2018,2021,2023 లో టైటిల్ గెలిచింది. ఐపీఎల్ లో ఇప్పటివరకు ధోనీ 250 ఐపీఎల్ మ్యాచ్ లాడాడు. 38.79 యావరేజ్ తో 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.