IPL 2024: లక్నోకు బ్యాడ్ న్యూస్.. యువ సంచలనం దూరం

IPL 2024:  లక్నోకు బ్యాడ్ న్యూస్.. యువ సంచలనం దూరం

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2024 లీగ్ దశలో భాగంగా  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరగనున్న మ్యాచ్ కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలర్, యువ సంచలనం మయాంక్ యాదవ్‌ గాయం కారణంగా.. లక్నో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ నెల 7న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఒక ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత గాయపడిన మయాంక్.. మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. 

అయితే, ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో.. మయాంక్ కు విశ్రాంతినిచ్చారు. ఫిట్ నెస్ లో అతను పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఏప్రీల్ 12వ తేదీ శుక్రవారం ఢిల్లీతో జరిగే మ్యాచ్ తోపాటు ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం జరగనున్న కోల్ కతా మ్యాచ్ లో మయాంక్ ఆడడం లేదని జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. మయాంక్ త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌కు తిరిగి వస్తాడని చెప్పాడు. ఏప్రిల్ 19వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడే మ్యాచ్ కు మయాంక్ అందుబాటులోకి వస్తాడని లాంగర్ తెలిపాడు.
 
IPL అరంగేట్రంలో 150kmph వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి సంచలనం సృష్టించిన 21 ఏళ్ల మయాంక్ యాదవ్.. కీలక సమాయాల్లో వికెట్లు పడగొడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో మయాంక్ రెండు మ్యాచ్ లకు అందుబాటులో లేకపోవడం లక్నో జట్టుకు గట్టి ఎదురుదెబ్బే. కాగా, ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ లో మూడు మ్యాచ్ లు గెలిచిన లక్నో.. ఆర పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది.