GT vs RR మధ్య క్వాలిఫయర్2.. ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. 87 లక్షలు సీజ్

GT vs RR మధ్య క్వాలిఫయర్2.. ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. 87 లక్షలు సీజ్

IPL Betting: ఒకవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గ్రాండ్ ఫినాలేకు కౌంట్‌డౌన్ షురూ కావడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, ఇదే టైమ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఇల్లీగల్ బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్స్‌పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. తాజాగా మహారాష్ట్రలో ఓ భారీ ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు అయింది.

9 మంది అరెస్ట్.. 87 లక్షలు సీజ్: 
కోల్‌హాపూర్ జిల్లాలోని ఇచల్‌కరంజి సిటీలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి, సుమారు రూ. 87 లక్షల విలువైన ఆస్తులను, నగదును సీజ్ చేశారు. ఈ ఇల్లీగల్ బెట్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించి మున్సిపల్ కార్పొరేటర్ నితేష్ పోవార్‌తో సహా మరో తొమ్మిది మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, తదుపరి విచారణ కోసం కోర్టు వారికి 3 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

ఏసీపీ ప్రెస్ మీట్: 
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నాసాహెబ్ జాదవ్ మాట్లాడుతూ.. ఇచల్‌కరంజి సిటీలోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతున్నట్లు మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది.. దాంతో మా టీమ్ వెంటనే రంగంలోకి దిగి రైడ్ చేసింది.. ఈ దాడిలో ఆరుగురు నిందితులను స్పాట్‌లోనే అదుపులోకి తీసుకున్నాం.. వారి నుంచి 12 మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, కొంత క్యాష్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ ద్వారా ఈ బెట్టింగ్ ముఠాలు చాలా సైలెంట్‌గా, ఆర్గనైజ్డ్‌గా నెట్‌వర్క్ నడుపుతున్నట్లు గుర్తించాం.. సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ డివైజెస్‌లో భారీగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్ డేటాతో పాటు పెద్ద గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన లింకులు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. 

క్వాలిఫైయర్ 2లో గుజరాత్ vs రాజస్థాన్ ఫైట్: 
ఇక క్రికెట్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2026 క్లైమాక్స్ రేస్ ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో ఈరోజు జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ డూ-ఆర్-డై (Do-or-Die) మ్యాచ్‌లో గెలిచిన టీమ్.. మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో టైటిల్ ఫైట్ చేయనుంది. దీంతో ఈరోజు మ్యాచ్‌పై క్రికెట్ లవర్స్‌లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.