కింగ్స్‌‌‌‌, రాయల్స్‌‌లో గెలిచేదెవరో ?

కింగ్స్‌‌‌‌, రాయల్స్‌‌లో గెలిచేదెవరో ?
  • నేడు రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌తో చెన్నై పోరు

ముంబై: ఐపీఎల్‌‌‌‌ –14లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడి వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగే లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో మూడు సార్లు చాంపియన్‌‌‌‌ చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌తో తలపడనుంది. సీజన్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన చెన్నై, రాజస్తాన్‌‌‌‌.. తమ సెకండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ల్లో గెలిచాయి. పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో  చెన్నై వన్‌‌‌‌సైడ్‌‌‌‌ విక్టరీ సాధిస్తే.. ఢిల్లీతో జరిగిన పోరులో రాయల్స్‌‌‌‌ ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్‌‌‌‌తో జరిగిన పోరులో నాలుగు వికెట్లతో అదరగొట్టిన పేసర్‌‌‌‌ దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌పైనే చెన్నై మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో సీఎస్‌‌‌‌కే బౌలింగ్‌‌‌‌ యూనిట్‌‌‌‌ సూపర్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అవ్వడం జట్టు కాన్ఫిడెన్స్‌‌‌‌ను రెట్టింపు చేసింది. సామ్‌‌‌‌ కరన్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ మరింత బాధ్యత తీసుకోవాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోరుకుంటోంది. సౌతాఫ్రికా పేసర్‌‌‌‌ లుంగి ఎంగిడి జట్టుతో కలవడంతో సీఎస్‌‌‌‌కే బౌలింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ పదును మరింత పెరిగింది. బ్యాటింగ్‌‌‌‌లోనూ చెన్నైకు పెద్దగా సమస్యల్లేవు. డుప్లెసిస్‌‌‌‌, మొయిన్‌‌‌‌ అలీ టచ్‌‌‌‌లో ఉండగా.. రాయుడు, రుతురాజ్‌‌‌‌ మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. సురేశ్‌‌‌‌ రైనా మరోసారి కీలకం కానుండగా.. ధోనీ ఫినిషింగ్‌‌‌‌ కోసం ఫ్యాన్స్‌‌‌‌ ఆతృతగా వెయిట్‌‌‌‌ చేస్తున్నారు. సీజన్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌లో డకౌటైన ధోనీకి పంజాబ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ చాన్స్‌‌‌‌ రాలేదు. మరోపక్క  పంజాబ్‌‌‌‌ చేతిలో దురదృష్టవశాత్తూ ఓడిన రాయల్స్‌‌‌‌.. ఢిల్లీపై గెలిచి కాన్ఫిడెన్స్‌‌‌‌ పెంచుకుంది. గత మ్యాచ్‌‌‌‌లో ఫెయిలైన రాజస్తాన్‌‌‌‌ టాపార్డర్‌‌‌‌ నిలకడ చూపాల్సి ఉంది.  అయితే డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌, క్రిస్‌‌‌‌ మోరిస్‌‌‌‌తో మిడిలార్డర్‌‌‌‌ బలంగా ఉంది. యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ సకారియా ఆకట్టుకుంటుండగా.. సీనియర్‌‌‌‌ జైదేవ్‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌అంచనాలు అందుకోవడం లేదు. ముస్తాఫిజుర్‌‌‌‌ రెహమాన్‌‌‌‌, మోరిస్‌‌‌‌ కీలక సమయంలో అండగా నిలుస్తున్నారు.