న్యూఢిల్లీ: ఫిజిక్స్‌వాలా, ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్, టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియాతో సహా ఐదు కంపెనీలు వచ్చే వారం ఐపీఓల ద్వారా సుమారు రూ.10 వేల కోట్లు సేకరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 11–14 మధ్య మూడు మెయిన్‌బోర్డ్, రెండు ఎస్‌ఎంఈ ఐపీఓలు ఓపెన్ కానున్నాయి. ఎడ్‌టెక్ కంపెనీ ఫిజిక్స్‌వాలా రూ.3,480 కోట్ల ఐపీఓ నవంబర్ 11న ప్రారంభమై 13న ముగుస్తుంది.
షేర్ ధర రూ.103–109 గా నిర్ణయించారు. టెక్ ప్లాట్‌ఫామ్, లెర్నింగ్ సెంటర్లను విస్తరించేందుకు ఈ ఫండ్స్ వాడతామని కంపెనీ ప్రకటించింది. వెహికల్ పార్టులు తయారు చేసే టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా, ఐపీఓ ద్వారా రూ.3,600 కోట్లు సేకరించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ప్రమోటర్లు షేర్లను అమ్ముతారు.
ఈ ఐపీఓ నవంబర్ 12న ఓపెనై, 14న ముగుస్తుంది. షేరు ధర రూ.378–397గా నిర్ణయించారు. గ్రేమార్కెట్‌లో కంపెనీ షేర్లు 24శాతం ఎక్కువ ధరకు ట్రేడవుతున్నాయి. సోలార్ సెల్స్ తయారు చేసే ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్ రూ.2,900 కోట్ల ఐపీఓ, నవంబర్ 11 నుంచి 13 వరకు జరుగుతుంది.
షేరు ధర రూ.206–217. ఎస్‌ఎంఈ విభాగంలో మహామాయ లైఫ్‌సైన్సెస్, వర్క్‌మేట్స్ కోర్2క్లౌడ్ సొల్యూషన్ ఐపీఓలు ఈ నెల 11న ఓపెనై, 13న ముగుస్తాయి. మరోవైపు సాస్ టెక్నాలజీ కంపెనీ క్యాపిలరీ టెక్నాలజీస్ ఇండియా ఐపీఓ ఈ నెల 14న ఓపెనై 18న ముగియనుంది. త్వరలో నోపేపర్ ఫార్మ్స్ ఐపీఓ టెక్ కంపెనీ నోపేపర్‌ఫార్మ్స్ తన ఐపీఓ పేపర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద దాఖలు చేసింది. మెరిట్టో, కలెక్సో ఈ కంపెనీ పాపులర్ ప్రొడక్ట్‌లు.
