ఐపీఎస్‌‌ ఆఫీసర్ సూసైడ్.. హర్యానా పోలీస్ శిక్షణ కేంద్రం ఐజీగా ఇటీవలే బదిలీ

ఐపీఎస్‌‌ ఆఫీసర్ సూసైడ్.. హర్యానా పోలీస్ శిక్షణ కేంద్రం ఐజీగా ఇటీవలే బదిలీ

చండీగఢ్: హర్యానా కేడర్‌‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వై.పురాన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఆయన చండీగఢ్‌‌ సెక్టార్ 11లోని  తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకుని చనిపోయారు. 

 ‘‘సెక్టార్ 11 పోలీస్ స్టేషన్‌‌కు మధ్యాహ్నం 1:30 గంటలకు కాల్పుల గురించి సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించాం. మృతుడిని ఐపీఎస్ అధికారి వై. పురాన్ కుమార్​గా గుర్తించాం. ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియరాలేదు. గదిలో సూసైడ్ నోట్ ఏమీ దొరకలేదు. దర్యాప్తు కొనసాగుతోంది" అని పోలీసులు పేర్కొన్నారు. 

2001 బ్యాచ్​కు చెందిన పురాన్ కుమార్.. పోలీస్ సర్వీస్‌‌లో ఉన్నత స్థాయి హోదాల్లో పనిచేశారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ర్యాంక్‌‌లో ఉన్నారు. సెప్టెంబర్ 29న ఆయన రోహ్‌‌తక్‌‌లోని సునారియాలోని పోలీస్ శిక్షణా కేంద్రం(పీటీసీ)లో ఐజీగా నియమితులయ్యారు.