ఐకూ నియో 10 ఆగయా.. స్నాప్‌‌‌‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌‌‌‌సెట్‌‌‌‌తో వస్తున్న మొదటి ఫోన్

ఐకూ నియో 10 ఆగయా.. స్నాప్‌‌‌‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌‌‌‌సెట్‌‌‌‌తో వస్తున్న మొదటి ఫోన్

ఐకూ తన కొత్త స్మార్ట్‌‌‌‌ఫోన్ ఐకూ నియో 10ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ స్నాప్‌‌‌‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌‌‌‌సెట్‌‌‌‌తో వస్తున్న మొదటి ఫోన్. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌‌‌‌తో పనిచేస్తుంది. ఇందులో 6.78 ఇంచుల డిస్​ప్లే, 7,000 ఎంఏహెచ్ ​ బ్యాటరీ, 120 వాట్ల ఫాస్ట్​ చార్జింగ్​, 16జీబీ వరకు ర్యామ్​, 512 జీబీ వరకు స్టోరేజీ, అల్ట్రావైడ్​కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ధరలు రూ.32 వేల నుంచి మొదలవుతాయి.