ముంబై: భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఇరాన్ నుంచి ఊహించని రీతిలో సామాజిక మాధ్యమాల్లో చురకలు తగిలాయి. ఇండియన్లను చూసి సభ్యత నేర్చుకోవాలంటూ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ వ్యంగ్యంగా స్పందించింది. మార్కో రూబియో తాను భారత్‌కు చేరుకున్నట్లు ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్ట్‌ను కోట్ చేస్తూ.. ఇరాన్ ముంబై కాన్సులేట్ హిందీలో ‘‘థోడా సీఖ్ లో యార్.. ‘సభ్యత కా క్రాష్ కోర్స్’ ఫ్రీ మే మిల్ జాయేగా!’’ (కొంచెం నేర్చుకో మిత్రమా.. సభ్యతపై క్రాష్ కోర్స్ ఇక్కడ ఉచితంగా దొరుకుతుంది!) అని ట్వీట్ చేసింది.
