యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 5 రోజుల బ్రేక్ ఇచ్చిన తర్వాత.. ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చర్చలు లేవు.. తొక్కా లేదు.. అసలు ట్రంప్ తో చర్ఛలే జరపలేదు అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది ఇరాన్. కొన్ని దేశాల ఒత్తిడులు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, ఆయిల్ సంక్షోభం క్రమంలో.. ఇరాన్ మరో సంచలన ప్రకటన చేసింది.
యుద్ధం శాశ్వతంగా ముగించాలన్నా.. భవిష్యత్ లో యుద్ధం జరగకూడదు అనుకున్నా.. రెండు కండీషన్లకు ఒప్పుకోవాలని అమెరికాకు అల్టిమేటం ఇచ్చింది ఇరాన్. యుద్ధం ప్రారంభం అయిన సమయంలో చేసిన ప్రకటనను మరోసారి గుర్తు చేసింది ఇరాన్. యుద్ధం మీరు మొదలుపెట్టారు.. యుద్ధం ఎప్పుడు ఆగుతుంది.. ఎలా ముగుస్తుంది అనేది మా చేతుల్లోనే ఉంది అప్పటి ప్రకటనను గుర్తు చేస్తుంది ఇరాన్.
- కండీషన్ నెంబర్ 1 :
ఇరాన్ దేశంపై విధించిన అన్ని ఆంక్షలు ఎత్తివేయాలి. అమెరికాతోపాటు ఇతర దేశాలు విధించిన ఆంక్షలు అన్నింటినీ తొలగించాలి. భవిష్యత్ లోనూ ఆంక్షలు విధించకూడదు.
- కండీషన్ నెంబర్ 2 :
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ దేశానికి చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలి. యుద్ధం వల్ల ఏర్పడిన నష్టాన్ని ఈ రెండు దేశాలు మొత్తం పరిహారం చెల్లించాలి.
ఈ రెండు కండీషన్లకు ఓకే అంటేనే చర్చలు. అప్పటి వరకు యుద్ధం కొనసాగుతుంది.. కొనసాగిస్తాం అని స్పష్టం చేసింది టెహ్రాన్.
ఇరాన్ దేశంపై పడే ఒక్కొక్క బాంబు.. గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.
ఇరాన్ కండిషన్స్ కు ట్రంప్ ఒప్పుకుంటారా..?
ఇరాన్ యుద్ధం కీలక దశలో ఉన్న తరుణంలో ఇరాన్ పెట్టిన కండిషన్స్ ట్రంప్ ఒప్పుకుంటారా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఇరాన్ యుద్ధం కీలక దశలో ఉన్న తరుణంలో ఇరాన్ పెట్టిన కండిషన్స్ ట్రంప్ ఒప్పుకుంటారా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హార్మూజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న ట్రంప్.. గల్ఫ్ లో జోక్యానికి దూరంగా ఉండాలంటే ఒప్పుకుంటారా అనేది చూడాలి. దీనికి తోడు యుద్ధానికి సంబంధించి నష్ట పరిహారం చెల్లించడం అంటే లక్షల కోట్ల ముచ్చట. అమెరికా కూడా యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ కు పరిహారం అనేది అగ్రరాజ్యం అంగీకరిస్తుందో లేదో చూడాలి.
యుద్ధం ఆగాలా వద్దా అనేది ఇరాన్ చేతిలో ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. ట్రంప్ ఆపమంటే భయపడి ఆపే స్థితిలో లేమని ఆ దేశ సీనియర్ అధికారి తెలిపారు. యుద్ధం ఆగాలంటే ఇరాన్ కంపెన్సేషన్ తో పాటు మరోసారి తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని అగ్రిమెంట్ రాసివాల్సిందిగా ఇరాన్ వాదిస్తోంది. దీనికి ట్రంప్ ఒప్పుకుంటారా అనేదే వేచి చూడాలి.
మరోవైపు హార్మూజ్ జలసంధి ఇరాన్ వద్ద పెట్టిన నిబంధనల కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్న అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ట్రంప్ దూకుడు కారణంగా అమెరికా అప్పుల పాలవుతుందని.. ఎలాంటి సన్నద్ధత లేకుండా ముందుకెళ్లి.. లక్షల కోట్ల అప్పు చేశారని అమెరికా నాయకులు, అధికారులే విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధానికి ఐదు రోజుల విరామం చెప్పినట్లు ట్రంప్ ప్రకటించారు.
విరామం ప్రకటించినప్పటికీ యద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. అమెరికా ఆగినా తాము ఆపేది లేదని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దీనికి తోడు అమెరికా బలగాలు కూడా అక్కడక్కడ దాడులు కొనసాగిస్తున్నట్లు గల్ఫ్ మీడియా ద్వారా తెలుస్తోంది.
పాకిస్తాన్ లో చర్చలు?
ఇరాన్ యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ లో ఇరు దేశాల మంత్రులు చర్చలు జరుపుతారని వార్తలు వస్తున్నాయి. యూఎస్ వైస్ ప్రసిడెంట్ జేడీ వాన్స్, దత్య వేత్త స్టీవ్ విట్ కాఫ్, వ్యాపారవేత్త జేర్డ్ కుష్నర్.. ఇరాన్ అధికారులతో పాకిస్తాన్ లో ఈ వారం చర్చలు జరుపుతారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
అయితే ఈ వార్తలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లివిట్ స్పందిస్తూ.. దౌత్య పరమైన నిర్ణయాలను మీడియా ముఖంగా మాట్లాడలేమని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు క్లిష్టంగా మారాయని.. చర్చల గురించి ముందుగా ఏమీ చెప్పలేమన్నారు.
