IRCTC నికర లాభం రూ. 284 కోట్లు

IRCTC నికర లాభం రూ. 284 కోట్లు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మొదటి త్రైమాసికంలో నికర లాభంరూ. 284 కోట్లుగా తెలిపింది. అధిక టికెట్ అమ్మకాలతో గతేడాది ఇదే క్వార్టర్ కంటే 2 శాతం లాభాలు వృద్ధి చెందినట్లు వెల్లడించింది. ఆన్ లైన్ టికెట్లు, రైళ్లలో ఆహారం సరఫరా ద్వారా ఆదాయం 20 శాతం పెరిగి రెవెన్యూ రూ. 1154.8 కోట్లకు చేరిందని మంగళవారం(మే28) రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. 

IRCTC బోర్డు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతి షేరుకు రూ. 4 తుది డివిడెండ్ గా ప్రకటించింది. ఇది 256 కోట్ల రూపాయల పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్‌లో 200 శాతం గా ఉంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకారం మే 28న IRCTC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.87,152 కోట్లు,షేర్లు 1.60 శాతంతో రూ.1,082.70కి చేరాయి. గడిచిన మూడు నెలల్లో షేర్ వ్యాల్యూ  19 శాతం పెరిగింది.

త్రైమాసికంలో వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన (EBIDTA) ముందు కంపెనీ ఆదాయాలు 3.4 శాతం వృద్ధితో రూ. 402.96 కోట్లకు చేరాయి. ఇది గత సంవత్స రంతో పోలిస్తే 36.8 శాతంగా ఉన్న EBIDTA మార్జిన్ 34.89 శాతానికి తగ్గింది.