Byjus Crisis: ఫీజు వాపస్ ఇవ్వలేదని.. బైజూస్ ఆఫీసులో టీవీలు ఎత్తుకెళ్లారు

Byjus Crisis: ఫీజు వాపస్ ఇవ్వలేదని.. బైజూస్ ఆఫీసులో టీవీలు ఎత్తుకెళ్లారు

కొన్ని కొన్ని సార్లు సర్వీస్ ప్రొవైడర్ల పనితీరు కస్టమర్లను చికాకు పెడతాయి. వారి కోపానికి గురవుతాయి. అటువంటిదే.. ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడర్ బైజూస్ విషయం లోనూ జరిగింది. ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బైజూస్.. చెల్లించిన ఫీజులు విద్యార్థులకు తిరిగి  చెల్లించడంలో విఫలమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బైజూస్ ఆఫీసుల పై పడి చేతికి అందిన వస్తువులను తీసుకెళ్తున్నారు. ఫీజులు వాపసు చెల్లించి వస్తువులు తీసుకెళ్లండి అని ఆఫీసులో ఉన్న సిబ్బందికి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు. బైజూస్ ఆఫీసులో టీలీ సెట్ ను విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన Edtech Gaint  బైజూస్ కస్టమర్ సర్వీస్ గురించి చర్చలకు దారితీసింది. 

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న edtech దిగ్గజం బైజూస్ కనీసం ఆఫీసుల రెంట్ చెల్లించలేని పరిస్థితిలో ఉంది. అద్దె బకాయి చెల్లించేందుకు డిపాజిట్ లను ఉపయోగించాల్సిన దుస్థితి. మూడేళ్ల క్రితం బెంగళూరులోని ప్రెస్టీజ్ గ్రూప్ తో ఆఫీస్ స్థలంకోసం లీజుకు ఒప్పందం కుదుర్చుకుంది బైజూస్.. నెలకు దాదాపు రూ.4 కోట్ల రెంట్ చెల్లిస్తోంది.

దీంతోపాటు కళ్యానీ టెక్ పార్కులో ఆఫీసు కోసం కళ్యాణీ డెవలపర్స్ తో5లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది. అయితే అద్దె చెల్లించడంలో బైజూస్ విఫలమైందని కల్యాణి డెవలపర్స్ నోటీసులు జారీ చేసింది. 

భూయజమానులతో కొనసాగుతున్న వివాదాలు, అద్దె చెల్లింపులపై డీఫాల్ట్ అవుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బైజూస్.. తాజా విద్యార్థుల తల్లిదండ్రుల చర్యలు పెద్ద సవాల్ గా మారాయి. ఫీజులు వాపస్ చెల్లించేవరకు వదిలేలా లేరు విద్యార్థులు తల్లిదండ్రులు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by lafdavlog (@lafdavlog)