మిడ్జిల్‌‌‌‌ మండల ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీల్లో వెలుగు చూసిన అక్రమాలు

మిడ్జిల్‌‌‌‌ మండల ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌జీల్లో వెలుగు చూసిన అక్రమాలు

మహబూబ్​నగర్​/మిడ్జిల్, వెలుగు: జిల్లాలోని కొన్ని మహిళా సంఘాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. సభ్యుల నుంచి పొదుపు పేరిట వసూలు చేస్తున్న డబ్బును కొందరు లీడర్లు బ్యాంకుల్లో జమ చేయకుండా పక్కదారి పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటికి సంబంధించి రికార్డులు మెయింటేన్​ చేయకపోవడం, డబ్బులు విషయం సభ్యులకు తెలియకుండా సీక్రెట్‌‌‌‌ ఉంచడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆడిట్‌‌‌‌ రికార్డులో పొందు పరిచేందుకు లెక్కలు చెప్పాలని ఆఫీసర్లు మూడేళ్లుగా అడుగున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.

మిడ్జిల్‌‌‌‌ మండల సంఘాల్లో..

మహబూబ్​నగర్‌‌‌‌లో ఒక మహిళా సమాఖ్య, 15 మండల సమాఖ్యలు, 475 గ్రామ సంఘాలు, 11,322 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,27,502 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మిడ్జిల్​ మండల కేంద్రంలో ఉన్న మూడు గ్రామ సంఘాల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘాలకు 2006 నుంచి 2009 వరకు మూడు విడతల్లో వాటర్ ​షెడ్ ద్వారా రూ.7.50 లక్షలు, ఐడబ్ల్యూ నాంది ఫౌండేషన్​ ద్వారా రూ.3 లక్షలు కలిపి మొత్తం 9.50 లక్షల నిధులు వచ్చాయి. వీటిని గ్రామ సంఘాలకు వ్యవసాయ పెట్టుబడులు, జీవనోపాధులకు, రూ.85 వేలు సభ్యులకు అప్పుల కింద ఇచ్చారు.  2011లో ఈ మూడు సంఘాల లీడర్లు టర్మ్‌‌ పూర్తయ్యింది. ఈ సమయంలో రూ.16 లక్షల క్యాష్​తో పాటు రికార్డులను కొత్తగా ఎన్నికైన లీడర్లకు అప్పగించారు. వాళ్లు అప్పటి నుంచి లెక్కలను చూపడం లేదు.  ఈ డబ్బును ‘ఆడిట్‌‌‌‌’లో పొందుపరచాల్సి ఉండటంతో ఆఫీసర్లు 2018 నుంచి రికార్డులను చూపించాలని అడుగుతున్నా సంఘం లీడర్లు పట్టించుకోవడం లేదు.  ఇటీవల ఓ సంఘం సభ్యులు గ్రామ సంఘానికి రూ.1.15 లక్షల అప్పు కట్టినా ఇంత వరకు ఆ డబ్బును లీడర్లు బ్యాంకులో జమ చేయలేదు. దీనికి సంబంధించిన లెక్కలను కూడా బయట పెట్టడం లేదు.

మిత్తీలకు ఇవ్వకుండా మింగేస్తున్నరు

మిడ్జిల్ ​మండలంలో 64 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో దాదాపు వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరు నెలకు గ్రామ సంఘానికి రూ.10, స్వయం సహాయక సంఘానికి రూ.100 చొప్పున మొత్తం రూ.110 జమ చేసుకుంటున్నారు. అలా మూడు నెలలకు ఓసారి అవసరం ఉన్న ఒక స్వయం సహాయక సంఘానికి రూ.20 వేలు ఇస్తారు. ఆ పైసలు తీసుకున్న సంఘం లీడర్ అవసరం ఉన్న సభ్యులకు మిత్తికి ఇవ్వాలి. కానీ, క్షేత్ర స్థాయిలో ఇవి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోకి ఎంట్రీ కాకపోవడంతో ఈ డబ్బులను కొందరు సంఘాల లీడర్లు సొంతానికి వాడుకుంటున్నారని తెలిసింది. ఈ రికార్డులను మొత్తం వీఏవో మెయింటేన్‌‌‌‌ చేయాల్సి ఉండగా, ఆయన ఈ బాధ్యతలను ఇతరులకు అప్పగించినట్లు తెలిసింది.   పొదుపు ద్వారా వస్తున్న కమీషన్‌‌‌‌ను మాత్రం తన అకౌంట్లో జమ చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఇటీవల కొందరు ప్రజాప్రతినిధులు ఏపీఎం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు సమాచారం.

రికార్డులు బయట పెట్టట్లే

మండలంలో 64 స్వయం సహాయక సంఘాలు ఉండగా, మూడు గ్రామ సంఘాలు ఉన్నాయి. ఇన్ని సంఘాలకు ముగ్గురు వీఏవోలు ఉండాలి. కానీ, ఒక్కరే ఉండటంతో అక్రమాలకు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, 2018లో మండలంలో ముగ్గురు వీఏవోలు ఉండాలని, ఒక్కరే ఉండటం వల్ల ఇబ్బంది అవుతోందని మండల ఆఫీసర్లు జిల్లా అధికారులకు లెటర్​ పెట్టారు. ఇందుకు వారు పర్మిషన్​ కూడా ఇచ్చారు. కానీ, వీఏవోలను రిజిస్ర్టేషన్​ చేసినప్పుడు ఒక్కొక్కరికి 22 సంఘాలను డివైడ్​ చేయాల్సి ఉంది. ఈ సంఘాలకు సంబంధించి పొదుపులు ఎక్కడున్నాయి? ఫండ్స్​ ఎక్కడ ఉన్నాయి? అనే రికార్డులు, వివరాలను వీరికి అప్పగించాల్సి ఉంది. అయితే సంఘాల లీడర్లు ఈ డీటెయిల్స్​ ఇవ్వకపోవడంతో 2018 నుంచి 
కొత్త వీఏవోలను రిజిస్ర్టేషన్​ చేసే పరిస్థితి లేకుండా పోయింది. రికవరీ అమౌంట్​ఉన్నట్లు చెబుతున్నారే తప్ప ఎవరి వద్ద ఉన్నాయనేది ఏండ్లుగా క్లారిటీ ఇవ్వడం లేదు.  

పీడీకి కంప్లైంట్​ చేయమని చెప్పిన 

నేను రెండేళ్ల కింద ఇక్కడికి వచ్చా. అప్పటి నుంచి గ్రామ సంఘాల్లో జరిగిన ఆడిట్ రిపోర్టులో ఎలాంటి అవినీతి  బయటపడ లేదు. వారం కింద స్థానిక ఎంపీటీసీ గౌస్ గ్రామ సంఘాల్లో అవినీతి జరిగిందని కంప్లైంట్​ ఇచ్చారు. ఈ విషయాన్ని పీడీ దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్​ చేయమని చెప్పా.
– రాందాస్​, ఏపీఎం, మిడ్జిల్​, మహబూబ్​నగర్​ జిల్లా