పంట రుణమాఫీలో అక్రమాలు..16 ప్యాక్స్​సెక్రటరీలపై వేటు

పంట రుణమాఫీలో అక్రమాలు..16 ప్యాక్స్​సెక్రటరీలపై వేటు
  •  13 సంఘాల సెక్రటరీలపై కో ఆపరేటివ్​శాఖ క్రమ శిక్షణ చర్యలు​

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీలో అక్రమాలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) సీఈవోలపై సహకార శాఖ చర్యలకు సిద్ధ మైంది. 105 సంఘాల కార్యదర్శులు రుణాల  అస లు, వడ్డీ తప్పుగా లెక్కించి సమాచారాన్ని పంపించారు. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కో ఆపరేటివ్ రిజిస్ట్రార్​ జిల్లా సహకార అధికారులను ఆదేశించారు. 

16 సంఘాలలో రుణాల మంజూరు, రెన్యూవల్ ​నిర్ణీత కాలంలో చేయక పోయినా ఆ క్లెయిమ్స్​ రుణమాఫీకి పంపించినట్టు రిజిస్ట్రార్​ గుర్తించారు. ఫలితంగా కొంతమంది అర్హులైన రైతుల పేర్లు ప్యాక్స్​పంపించిన లిస్ట్​లో లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ ​బ్యాంకుల ఆర్థిక సహకారంతో నడుస్తున్న 11 ప్యాక్స్, డీసీసీసీ సహకారంతో నడుస్తున్న 5 ప్యాక్స్​ సెక్రటరీలను సస్పెండ్ ​చేస్తూ సహకార శాఖ రిజిస్ట్రార్​ నిర్ణయం తీసుకున్నారు. 

13 సంఘాలకు సంబంధించిన కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు పూనుకోవడంతో పాటు మరో 92 సంఘాలకు సంబంధించి సెక్రటరీలను సంజాయిషీ కోరినట్టు సహకారశాఖ డైరెక్టర్, రిజిస్ట్రార్​ వెల్లడించారు.