సీబీడీటీ కొత్త చైర్మన్‌గా నితిన్ గుప్తా

సీబీడీటీ కొత్త చైర్మన్‌గా నితిన్ గుప్తా

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా ఐఆర్‌ఎస్ అధికారి నితిన్ గుప్తాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయించిన తేదీ నుంచి గుప్తా సీబీడీటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర రెవెన్యూ శాఖ నియామకాల కమిటీ సెక్రటేరియట్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

1986 బ్యాచ్ కు చెందిన గుప్తా ప్రస్తుతం సీబీడీటీ బోర్డు సభ్యునిగా ఉన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈయన పదవీ విరమణ చేయనున్నారు. సీబీడీటీ చైర్మన్‌గా ఉన్న మోహపాత్ర ఏప్రిల్ 30న రిటైర్ కావడంతో సంగీతా సింగ్ తాత్కాలికంగా ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బోర్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారు.