నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో నాని ఓదెల 2 అనే వర్కింగ్ టైటిల్ తో.. నాని, శ్రీకాంత్ ఓదెల మరో మూవీని తెరకెక్కించబోతున్నారు.
అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే అంశంలో మేకర్స్ ఆలోచిస్తున్నారట. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ మూవీకి బాలీవుడ్ బ్యూటీ శద్ధాకపూర్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్. ఆమె అయితేనే ఈ మూవీకి సరిపోతుందని అనుకుంటున్నారట.
ALSO READ | దేవర సినిమాకోసం బాలీవుడ్ స్టార్స్ అన్ని కోట్లు తీసుకున్నారా..?
అయితే శ్రద్ధాకపూర్ ను ఫైనల్ చేస్తారా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. సాహోలో ప్రభాస్ సరసన నటించిన శ్రద్ధా ఆ మూవీతో తెలుగు ఫ్యాన్స్ నుంచి మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం స్త్రీ2 మూవీ సక్సెస్ లో జోష్ మీద ఉన్న శ్రద్ధాకపూర్ నానికి జోడీగా వస్తుందో లేదో చూడాలి. కాగా నాని ఓదెల 2 మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు.
On the auspicious occasion of Vijaya Dashami, the BLOCKBUSTER team, #NaniOdela2 embark on a journey to tell a story that will be etched in gold in World Cinema ✨#NaniOdela2 begins with a pooja ceremony ❤️🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) October 12, 2024
Shoot commences soon. Stay tuned for more exciting updates 💥
Natural… pic.twitter.com/uWgBomFfgR
ఇకపోతే.. శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘స్త్రీ 2’ మూవీ బాక్సాఫీస్ నాట ఓ సంచలనంగా నిలిచింది. సుమారు రూ.870 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇపుడు నాని ఓదెల 2 ప్రాజెక్ట్ లో భాగమైతే భారీ బజ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్త్రీ 2 మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ జోరు చూపిస్తోంది.