టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ అయినా విషయం తెలిసిందే. ఐతే ప్యాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, మలయాళీ తదితర సినీ పరిశ్రమలకి చెందిన నటీనటులు నటించారు.
సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, అభిమన్యు సింగ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే దేవర చిత్రం ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ.525 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రంలో విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించాడు. అయితే సైఫ్ అలీఖాన్ దేవర చిత్రంలో నటించినందుకుగానూ దాదాపుగా 12 నుంచి రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక నటి జాన్వీకపూర్ కూడా దాదాపుగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.
అయితే బాలీవుడ్ స్టార్స్ ని తీసుకుంటే హిందీలో బిజినెస్ పెరుగుతుందన్న స్ట్రాటజీ దేవర చిత్రానికి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఓపెనింగ్ డే నుంచి ఇప్పటివరకూ రూ.80 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో దేవర చిత్రం ఓవర్సీస్ మరియు తెలుగులో మాత్రమే ఎక్కువ శాతం కలెక్షన్లు రాబట్టింది.