అదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మేకర్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో ఉన్న రికార్డులను ఒక్కొక్కటి దాటుకుంటూ దూసుకెళ్తోంది. 2026, మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, కేవలం పది రోజుల్లోనే రూ.1226 కోట్ల కలెక్షన్లు సాధించి ప్రకంపనలు పుట్టిస్తోంది.
ఇండియా మార్కెట్‌లో ఈ చిత్రం రూ.778.77 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకుంది. రూ.930.44 కోట్ల గ్రాస్ వసూళ్ళ మైలురాయిని దాటేసింది. ఇక రెండో శనివారం మార్చి 28న ఒక్కరోజే రూ.62.85 కోట్లు వసూలు చేసి, 18,820 షోల్లో సగటున 44.8% ఆక్యుపెన్సీ నమోదు చేయడం విశేషం. 11వ రోజులోకి అడుగుపెట్టినా, ధురంధర్ ఏ మాత్రం దూకుడు తగ్గకుండా దూసుకెళ్తోంది.
బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకున్న‘ధురంధర్ 2’:
‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఇండియాలో ఇప్పటికే రూ.750 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది అతిపెద్ద థియేట్రికల్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఓవర్సీస్ విషయానికి వస్తే, నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ చిత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే అక్కడ $19.40 మిలియన్ల వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే గత భారీ రికార్డులైన బాహుబలి 2 రికార్డులను అధిగమించడం విశేషం. అంతేకాకుండా, కల్కి 2898 AD ($18.60 మిలియన్) లైఫ్ టైం వసూళ్లను కూడా దాటేసింది.
అలాగే, పఠాన్ -17.5 మిలియన్ డాలర్లు, జవాన్ 15.6 మిలియన్ డాల్లు, RRR-15.3 మిలియన్ డాలర్లు, పుష్ప 2 -15.3 మిలియన్ డాలర్లతో వసూళ్లలో దిగ్గజ చిత్రాలను సైతం వెనక్కి నెట్టింది. ఈ సక్సెస్ ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా ‘ధురంధర్ 2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అరుదైన రన్‌ను కొనసాగిస్తూ, మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది.ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘ధురంధర్ 2’ ముందున్న అసలు సవాల్:
ఇకపోతే.. ‘దంగల్’, ‘బాహుబలి’, ‘పుష్ప2’ చిత్రాల జీవితకాల కలెక్షన్లను ధురంధర్ 2 బీట్ చేయాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘దంగల్’ (రూ.2,024 కోట్లు) రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఆ తర్వాత ‘బాహుబలి 2’ (రూ.1,810 కోట్లు), ‘పుష్ప2’ (రూ.1,800 కోట్లు) సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి ఈ వసూళ్లను ధురంధర్ 2 బీట్ చేస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే, రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘దురంధర్ 2’, ఈ భారీ టార్గెట్లకు దగ్గరవుతున్నప్పటికీ, ఇంకా గణనీయమైన దూరం ఉంది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే రూ.1,500 కోట్ల మార్క్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ‘దంగల్’ స్థాయి రికార్డును బ్రేక్ చేయాలంటే దీర్ఘకాలిక స్థిరమైన రన్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో మరింత బలమైన కలెక్షన్లు అవసరం. మొత్తంగా.. ‘ధురంధర్ 2’ రన్ ఇప్పటికీ బలంగానే కొనసాగుతుండటంతో, ఈ రికార్డులను బీట్ చేస్తుందా లేదా అన్నది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తారాగణం
ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు నటించడం సినిమాకు భారీ హైప్‌ను తీసుకొచ్చింది. రాకేష్ బేడీ, డేనిష్ పాండోర్, సారా అర్జున్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గూఢచారి వ్యవస్థ, దేశభక్తి, రివెంజ్ డ్రామా కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక ‘లార్జర్ దాన్ లైఫ్’ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. మొత్తానికి, ఆదిత్య ధర్ తన శిష్యరికం నుంచి బయటకు వచ్చి, గురువు ఆర్జీవీ గర్వపడేలా ఇండియన్ బాక్సాఫీస్ మ్యాప్‌ను మార్చేస్తున్నారు.
