గుడ్డును సాయంత్రం తింటే ఏమి జరుగుతుందో తెలుసా..?

గుడ్డును   సాయంత్రం తింటే ఏమి జరుగుతుందో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా సీజనల్ ఫుడ్స్ ఉంటాయి.  ఏ సీజన్ లో ఏవి దొరికితే వాటిని ప్రజలు ఎంతో ఇష్టంగా లొట్టలేసుకొని తింటారు.  ఉదాహరణకు వేసవి కాలంలో మామిడి.. వర్షాకాలంలో సీతా ఫలాలు.. ఇలా అనేక రకాల పండ్లు ఉన్నాయి.  కాని గుడ్డు అనేది ఏడాది పొడవునా లభిస్తుంది.  దీనిని రోజు తినే వారు కూడా ఉన్నారు.  ఇది చాల బలవంతకమైన ఆహారం.  అయితే గుడ్డును సాయం వేళల్లో తింటే  అనేక లాభాలు కలుగుతాయి.  రోజూ  సాయంత్రం  గుడ్లు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  గుడ్డులో ప్రోటీన్లు ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటి విటమిన్లు ఉన్నాయి. ఈ పోషకాలు ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తాయి. అయితే గుడ్డును సాయంత్రం తింటే  ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది

సాయంత్రం పూట గుడ్లు తినడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉండి.. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ట్రిప్టోఫాన్  మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.  హార్మోన్లలో  ఉండే లోపాలను అరికడుతుంది. ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి కాబట్టే  సాయంత్రం గుడ్లు తినాలి.

 నిద్రను మెరుగుపరుస్తుంది

నిద్రను మెరుగుపరచడంలో గుడ్డులోని మెలటోనిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది నరాల కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. వాస్తవానికి, మెలటోనిన్  గడియారాన్ని సెట్ చేసే హార్మోన్ మాదిరిగా  నిద్ర లేమిలో పెద్ద పాత్ర పోషిస్తుంది. పగలు నిద్రపోతే విధులకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం సమయాల్లో గుడ్డు తింటే ఆరోగ్యానికి.. ఆరోగ్యం.. నిద్రకు నిద్ర ఉంటాయి. 

విటమిన్ డి సప్లిమెంట్లను పెంచుతుంది

విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు  ఎముకలు , మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి.  సాయంత్రం గుడ్లు తింటే, అవి మంచి కొలెస్ట్రాల్ రూపంలో శరీరంలో నిల్వ చేయబడతాయి.   ఉదయం  శరీరానికి సూర్యుని వేడి  తగిలినప్పుడు అవి విటమిన్ డిని తయారు చేయడం ప్రారంభింస్తాయి. 

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

సాయంత్రం పూట గుడ్లు తినడం బరువు తగ్గడానికి రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటిది   పొట్ట  కదలికను వేగవంతం చేస్తుంది . ఇక రెండవది   శరీరరంలో ప్రోటీన్లు ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది. రాత్రి భోజనాన్ని పరిమాణాన్ని  తగ్గిస్తుంది. అంతే కాకుండా  కండరాలను ధృడంగా ఉండేందుకు గుడ్డు  ఎంతో ఉపయోగకారి.  హార్మోన్ల పనితీరును సమతుల్యంగా ఉంచడం వలన శరీరం  బరువు తగ్గేందుకు దారితీస్తుంది.