
దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా(Ileana)కు మొదట్లో బోలెడన్నీ ఆఫర్లొచ్చాయి. పోకిరి, జల్సా, కిక్, జులాయి..ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. బర్ఫీ మూవీతో హిందీ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌కు దూరమైంది.
ప్రస్తుతం ఆమె నటించిన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ, లవర్స్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఇలియానా.. మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందని, ఈ ఏడాది మే నెలలో వీరి పెళ్లి జరిగిందని వార్తలొచ్చాయి. ఆగస్టులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందీ బ్యూటీ. బాబు ఆలనాపాలనా చూసుకుంటున్న ఇలియానా సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఇలియానా సినిమాలపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదంటున్నారు.
మరి ఇలియానా నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా? లేదంటే పిల్లాడు పెద్దయ్యేంతవరకు మాత్రమే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.