కరోనా పోయేదాకా ప్రెగ్నెన్సీ వాయిదా మంచిదేనా?

కరోనా పోయేదాకా ప్రెగ్నెన్సీ వాయిదా మంచిదేనా?

సమస్య: ఇప్పుడున్న పరిస్థితులు మారేలా లేవు. కరోనాతో సహజీవనానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. కొన్ని నెలల వరకు వ్యాక్సిన్, మెడిసిన్ వచ్చే సూచనలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని కనడం పెద్ద సమస్యే. రెగ్యులర్ చెకప్, డెలివరీకి కరోనాతో రిస్క్. ప్రెగ్నెన్సీ వాయిదా వేసుకోవాలని ఇంట్లో వాళ్లంటున్నారు. పిల్స్ వాడితే ముందుముందు సమస్యలుంటాయా? పిల్స్ కాకుండా వేరే మార్గాలేమైనా ఉన్నాయా? 

–పి. మాధవి, హైదరాబాద్​

సలహా: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తల్లిపై, పిండం ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం ఉందో తెలియదు. ఆర్గనైజెస్​ పిరియడ్​ ( పిండంలో అవయవాలు పెరిగే 12 వారాల సమయం)లో రక్తనాళాలు, మెదడు, ఊపిరితిత్తులు, గుండె మొదలైన అవయవాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కోవిడ్​ 19 ప్రభావం ఏ తీరుగా ఉంటుందో స్టడీ లేదు. అందుకే ఈ టైమ్​లో ప్రెగ్నెన్సీ ప్లాన్​ చేసుకోవడం మంచి ఆప్షన్​ కాదు.

ఆరు నెలల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్​ చేసుకోవడం మంచిది. ఈ లాక్​డౌన్​ టైమ్​లో వర్కవుట్స్​ చేస్తూ మంచి ఫుడ్​ తింటూ బాడీని హెల్దీగా మార్చుకోవాలి. ఊబకాయం ఉన్నవాళ్లు కార్బోహైడ్రేట్స్​ తక్కువ ఉన్న ఫుడ్​ తినాలి. వ్యాయామం చేస్తూ వెయిట్​ తగ్గించుకోవాలి. వీటితోపాటుగా ఫోలిక్​ యాసిడ్​ టాబ్లెట్స్​ వేసుకోవాలి.

ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవాలంటే చాలా అవకాశాలున్నాయి. వీటిలో ఉండే నష్టాలు, ఇబ్బందులు తెలుసుకుని డాక్టర్​ సలహాతో సేఫ్​ మెథడ్స్​ ఫాలో కావాలి. సేఫ్​ క్యాలెండర్​ మెథడ్​, కండోమ్​, పిల్స్​ మొదలైన పద్దతుల్లో ప్రెగ్నెన్సీని వాయిదా వేయొచ్చు. వీటిలో సేఫ్​ క్యాలెండర్​ మెథడ్​ చాలా సేఫ్​. అండం విడుదలయ్యే టైమ్​కి నాలుగు రోజులు ముందు, అండం విడుదలైన నాలుగు రోజుల తర్వాత భార్యాభర్తలు కలవకూడదు.

ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం కోసం పిల్స్​ వాడటం మంచిది కాదు. వీటిలో కొన్ని రకాల పిల్స్​కి ఫెయిల్యూర్​రేట్​ ఎక్కువ. కొన్ని రకాల పిల్స్​వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్​ అవుతుంది. కొన్ని పిల్స్​ వల్ల ఊబకాయం, పింపుల్స్​ రావడం, జుట్టు ఊడిపోవడం, రొమ్ముల్లో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

– డాక్టర్​ కావ్య ప్రియ వజరాల,

గైనకాలజిస్ట్​, కేర్​ హాస్పిటల్​