రవితేజ ఫ్యాన్స్కు వెయిటింగ్ తప్పదా.. కొత్త ప్రచారంలో నిజమెంత?

రవితేజ ఫ్యాన్స్కు వెయిటింగ్ తప్పదా.. కొత్త ప్రచారంలో నిజమెంత?

తెలుగు సినిమా మేకర్స్ కు పెద్ద పండుగ అంటే సంక్రాంతి అనే చెప్పాలి. అందుకే ఈ ఫెస్టివల్ సీజన్ క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేసి మరీ సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. పిల్లలకు, పెద్దలకు వరుస సెలవులు ఉండటంతో.. సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అందుకే ఈ సీజన్ కోసం పెద్ద పెద్ద సినిమాలు సైతం పోటీ పడుతుంటాయి. గత సంక్రాంతికి సైతం బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నడిచింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు.. మూడు పెద్ద సినిమాలు బరిలో నిలిచి సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

అదే విదంగా ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ నుండి ఏకంగా ఐదు సినిమాలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధమయ్యాయి. అందులో మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ రెండు లేదా మూడు సినిమాలు మాత్రమే పోటీలో నిలిచేవి.. ఈసారి మాత్రం ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి. అయితే వాటిలో కనీసం రెండు సినిమాలైనా వాయిదా పడటం ఖాయం అని అందరు భావించారు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు కానీ.. ఎవ్వరూ తగ్గకపోవడంతో చేసేదేమీలేకుండా పోయింది.

దీంతో ప్రేక్షకులు కూడా ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వార్ కోసం ప్రిపేర్ అయ్యి ఉన్నారు. దీంతో ఈ ఫెస్టివల్ సీజన్ విన్నర్ ఎవరు కానున్నారు అనే ఉత్కంఠ కూడా మొదలైంది. అయితే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు రవితేజ హీరోగా వస్తున్న ఈగల్ సినిమా  సంక్రాంతి వార్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. అయితే ఈగల్ వాయిదా విషయంలో మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో.. రవితేజ ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. తమ హీరో నటించిన గత చిత్రం టైగర్ నాగేశ్వర రావు సరిగా ఆడకపోవడంతో తమ ఆశలన్నీ ఈగల్ మీదే పెట్టుకున్నారు. పండుగకి వచ్చి సూపర్ హిట్ కొడతాడని భావించారు. కానీ, తాజాగా న్యూస్ తో వాళ్లకు నిరాశ తప్పలేదు. మరి ఈగల్ సినిమా వాయిదా నిజమేనా? లేక రూమర్సా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.