శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ అర్హత లేదా..?

V6 Velugu Posted on Aug 03, 2021

  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్: అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి అర్హత లేదా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాడి కౌషిక్ రెడ్డిది కీలకపాత్ర అని కేసీఆర్ భావించినట్లున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం డ్రామాలకు పర్యాయ పదం మామా అల్లుళ్లు కేసీఆర్, హరీష్ రావులు సినిమా నటుల కంటే గొప్ప నటులు అని ఆయన విమర్శించారు. మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం మంత్రి హరీష్ రావుకే చెల్లుతుందని ఆయన పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన మాజీమంత్రి ఈటల కాలు ఆపరేషన్ పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. హరీష్ రావు డ్రామాలకు శ్రీకాంతాచారి బలైయ్యాడని ఆయన ఆరోపించారు. 
పెట్రోల్ కొనుక్కున్న హరీష్ రావు అర్ద రూపాయి అగ్గిపెట్టె మర్చిపోవడం డ్రామాలో భాగం కాదా..?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ కొనుకున్న హరీష్ రావు 50పైసల్ అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామాలో భాగం కాదా? అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. హరీష్ రావుది డ్రామా అని తెలియకనే శ్రీకాంతాచారి ప్రెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడన్నారు. నిరాహారదీక్ష ముసుగులో కేసీఆర్ ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్ తాగింది నిజం కాదా? .. తనకు జ్యూస్ ఇచ్చిన డాక్టర్ వేరే పార్టీలో ఉంటే కష్టమని ఖమ్మంలో జ్యాస్ ఇచ్చిన డాక్టర్ కు గులాబీ కండువా కప్పలేదా? అని ఆయన ప్రశ్నించారు. 2008లో రాజశేఖరరెడ్డిని కలసి కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమైన హరీష్ రావుతో చెప్పించే స్థితిలో మేము లేమన్నారు. పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు క్యాబినెట్ లో చోటు కల్పించాలన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ..కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది కాలమే సమాధానం చెబుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాలు, కిషన్ రెడ్డి యాత్ర కారణంగానే బండి‌ సంజయ్ పాదయాత్ర వాయిదా పడిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. 
 

Tagged MLA Raghunandan Rao, , hyderabad bjp today, hyderabad bjp office today, bjp mla raghunandana rao, raghunandan rao latest updates, hot comments on kcr and hareesh rao, kcr and hareesh rao real actors

Latest Videos

Subscribe Now

More News