మనం వాడుతున్న తేనె మంచిదా..? కాదా.?

మనం వాడుతున్న తేనె మంచిదా..? కాదా.?

తేనె నేచురల్ యాంటీబయోటిక్. అసలు మనం ఉపయోగించే తేనె మంచిదా…? కాదా..?  స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. కానీ, కంపెనీలు అమ్ముతున్న తేనె బాటిళ్లపై ఎక్స్‌‌పైరీ డేట్ ఉంటుంది. ఎందుకంటే… అది నిజమైన తేనె కాదు కాబట్టి. అది ప్రాసెస్ చేసిన తేనె కావడం వల్ల దాన్లో సహజ లక్షణాల్ని అది కోల్పోతుందన్నమాట. తేనెను ప్రాసెస్ చేసే క్రమంలో వేడి చేస్తాయి కంపెనీలు. అలా వేడి చేస్తే… తేనెలోని ఎంజైములు, ప్రోబోటిక్సులు, ఇతర పోషకాలు దెబ్బతింటాయి. తేనెలో 18 శాతం కంటే తక్కువ వాటర్ ఉంటే అది స్వచ్ఛమైన తేనె కింద లెక్క. తేనె తాజాగా ఉండాలని దాన్ని ప్రిజ్‌‌లో పెట్టకూడదు. అలా చేస్తే అది చక్కెరలా మారిపోతుంది. దాన్ని బయటే సీసాలో పోసి… గాలి లోపలికి వెళ్లకుండా మూత టైట్‌‌గా పెట్టాలి.

షాపుల్లో అమ్మే తేనె బాటిళ్లలో తేనెతోపాటూ కార్న్ సిరప్, పిండి, స్టార్చ్, డెక్ట్రోజ్, ప్రిజర్వేటివ్స్  కలుపుతారు. ఈ వివరాలు తేనె బాటిల్ పై రాసి ఉంటాయి. అందుకే కొనేముందు ఆ బాటిల్ మీద ఉండే వివరాలని చదవాలి. తేనెలో కలిపే పదార్థాలు ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. కానీ వీలైనంత వరకూ పల్లెల్లో దొరికే ముడి తేనెను కొనుక్కోవడమే బెటర్.