Vastu tips : పేరుకు.. వాస్తుకు సంబంధం ఉంటుందా.. వాటర్ ట్యాంక్ విషయంలో పాటించాల్సిన నియమాలు ఇవే..!

Vastu tips :  పేరుకు.. వాస్తుకు సంబంధం ఉంటుందా.. వాటర్ ట్యాంక్ విషయంలో పాటించాల్సిన నియమాలు ఇవే..!

ఇల్లు నిర్మించుకొనే విషయంలో  కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటిస్తాం.  మరి ఇంట్లో ఎవరి పేరుతో వాస్తు ను పరిశీలించాలి.. అసలు పేరుకు .. వాస్తుకు సంబంధం ఉంటుందా.. ఇంకా వాటర్​ ట్యాంక్​.. వాటర్​ సంప్​ విషయంలో ఎలాంటి వాస్తునియమాలు పాటించాలి.. ఈ విషయాల గురించి .. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ ఇస్తున్న సూచనలను ఒకసారి పరిశీలిద్దాం. .  .!

ప్రశ్న: వాస్తుకు, మనిషి పేరుకు సంబంధం ఉంటుందా? అలాగే ఆ పేరు కచ్చితంగా జన్మ నక్షత్రం చూసే పెట్టాలా?  జాతకం ప్రకారం పెట్టలేదు. అయినా వాస్తు చూపించుకో వచ్చా? అలాగే  వాస్తును ఇంట్లో ఎవరి పేరు మీదైనా చూపించుకోవచ్చా? లేక స్థలం ఎవరి పేరు మీద ఉందో వాళ్లదే చూపించాలా?

జవాబు:ఇంట్లో నడిచే వ్యక్తికి, వాస్తుకు కచ్చితంగా సంబంధం ఉంటుంది. మీ విషయాని కొస్తే... స్థలం, ఇల్లు ఎవరి పేరు మీద ఉందన్నది ముఖ్యం కాదు. వాస్తు కేవలం ఇంటి యజమాని అయిన భర్త పేరు మీదే చూపించాలి. ఆ పేరు జన్మ నక్షత్రం మీదే పెట్టాలనేమీ లేదు. అందరూ పిలిచే పేరు మీదే వాస్తు చూడొచ్చు. సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా... ఇంటి యజమాని పేరు. మీద చూపించుకోవాలి. దాని ప్రకారమే కట్టడం మొదలుపెట్టాలి. అద్దె ఇల్లు అయితే ఆ విధంగా ఉన్నదాంట్లోకి మారాలి.


ప్రశ్న: మా బిల్డింగ్​ పై  ఉన్న సిమెంట్ వాటర్ ట్యాంక్​ ను  తొలగించి ప్లాస్టిక్ ట్యాంక్​  పెట్టాలనుకుం టున్నాం. అయితే పాత ట్యాంక్ వాస్తు ప్రకారం లేదంటున్నారు. తెలిసినవాళ్లు. మరి ఇప్పుడు కొత్త ట్యాంక్​ ను  ఏ మూలకు...  ఏ దిక్కుకు పెట్టొచ్చో తెలియజేయగలరు..

జవాబు: నీళ్ల సంపు, బోర్ వెల్, చేదుకునే బావి ఏదైనా ఈశాన్యంలోనే ఉండాలి. ఎందుకంటే ఈశాన్యంలో నీరు ఉంటుంది. శివుడు అక్కడ ఉంటాడు. కాబట్టి గంగ అక్కడే ఉంటుందంటారు. అలా కాకుండా అవి మరెక్కడున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అదే బిల్డింగ్ పై పెట్టే ట్యాంకులైతే... వాయువ్యం, ఆగ్నేయం, మధ్య దక్షిణం, మధ్య పడమరలో మాత్రమే ఉండాలి. కానీ చాలామంది ఈశాన్యం, నైరుతిలో పెడుతున్నారు. ఈశాన్యంలో పెడితే బరువు ఎక్కువవుతుంది. నైరుతి రాక్షస స్థానం. కాబట్టి అక్కడ నీళ్లు ఉండకూడదు. అది ఏ మాత్రం శుభం కాదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వాటర్ ట్యాంక్ గేటుకు ఎదురుగా ఉండొద్దు. అలాగే దాని మీది నుంచి నడవొద్దని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ చెబుతున్నారు.