
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), స్టైలీష్ డైరెక్టర్ సుజిత్(Sujeeth) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). గ్యాంగ్ స్టార్స్ నేపధ్యలో రానున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి కారణం పవర్ స్టార్ ఫస్ట్ టైమ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించడం. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతోంది. అదేంటంటే.. దర్శకుడు సుజీత్ ప్రీవియస్ సినిమా సాహూ(Sahoo). ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మొత్తం వాజీ(Waaji) అనే సిటీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా పవన్ ఓజీ సినిమాలో కూడా వాజీకి సంబంధించిన ఒక రిఫరెన్స్ ని చూపించారు సుజీత్. రీసెంట్ గా ఓజీ నుండి లీకైన పిక్స్ లో వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే బోర్డు కనిపించింది. దీంతో.. ఓజీ సినిమాకు సాహూతో లింక్ ఉండనుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త నిజమేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఒక వేళా నిజమైతే మాత్రం ఓజీ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవల్లో ఉండటం ఖాయం.
ఇక పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాపైనే ఎక్కువ బజ్ క్రియేట్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి, తమిళ యాక్టర్ అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి వంటి స్టార్ క్యాస్ట్ ఎంట్రీ తో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. ఇప్పటికి ఒక్క అఫీషియక్ లుక్ కూడా రిలీజ్ కాకుండానే జస్ట్ లీకుడు పిక్స్ తో భారీ అంచనాలను పెంచేస్తోంది ఈ సినిమా. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో తెలియాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే.