Health : : విటమిన్ డి లోపిస్తే.. డిప్రెషల్ లోకి వెళ్లిపోతారా.. పరిశోధనల్లో కీలక అంశాలు

Health : : విటమిన్ డి లోపిస్తే.. డిప్రెషల్ లోకి వెళ్లిపోతారా.. పరిశోధనల్లో కీలక అంశాలు

సూర్యకాంతి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ విటమిన్ డి వల్ల శరీరంలో అనేక పరిణామాలు కూడా చోటుచేసుకుంటాయి. విటమిన్ డి స్థాయిలు మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైన సమాచారం ప్రకారం విటమిన్ డి లోపం డిప్రెషన్‌ కు కూడా దారి తీస్తుందట. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా వారి రక్తంలో విటమిన్ డి ప్రసరణను తక్కువగా కలిగి ఉంటారని పరిశోధనలో తేలింది.

విటమిన్ డి అందిన తర్వాత వారి మానసిక స్థితిలో మెరుగుదల వచ్చినట్టు కూడా ఈ అధ్యయనం తెలిపింది. ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ముగ్ధ ప్రధాన్, CEO, స్థాపకుడు, iThrive ప్రకారం, డిప్రెషన్ లో ఉన్న వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా డిప్రెషన్ కు అనేక కారణాలున్నప్పటికీ విటమిన్ డి లోపం వల్ల అది ధీర్ఘ కాలంలో తీవ్రమైన సమస్యగా మారే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో విటమిన్ డి స్థాయిలు తక్కువ ఉండడం.. ప్రసవానంతరం ఎదురయ్యే పరిస్ఖితులతో ముడిపడి ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ప్రసవం తర్వాత కొన్ని వారాలు లేదా నెలల వరకు ఆ తల్లులను ప్రభావితం చేస్తుంది.

విటమిన్ డి లోపం దీర్ఘకాలిక వెన్నుపాము గాయాలు, స్ట్రోక్, మల్టిపుల్ స్క్లెరోసిస్ కు దారి తీయవచ్చు.  ఇది వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితులపైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజూ 30 నిమిషాలు ఆరుబయట గడపడం, సూర్యరశ్మిలో ఉండడం చాలా ముఖ్యం. "విటమిన్ డి డిప్రెషన్, మూడ్ రెగ్యులేషన్, నిద్ర, ఆకలితో ముడిపడి ఉన్న సెరోటోనిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది" అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి సూర్యరశ్మితో పాటు కొవ్వు చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, సేంద్రీయ పాలు వంటి ఆహారాల్లో విరివిగా లభిస్తుంది.

విటమిన్ డి లోపం ప్రభావాలు

విటమిన్ డి లోపం వల్ల కండరాలు క్షీణించి, డిప్రెషన్, మూడ్ స్వింగ్‌లకు దారి తీస్తుంది. అలసటతో పాటు తరచుగా కాళ్ల నొప్పులు వస్తాయి. నడుము నొప్పి, వెన్నెముక క్షీణించడం, డిస్క్ సమస్యలు, కీళ్ల నొప్పులతో కూడా బాధపడవచ్చు. "విటమిన్ D లేకపోవడం వల్ల కాల్షియం ఎముకలలోకి తగినంతగా శోషించబడనందున ఎముక సంబంధిత సమస్యలు సర్వసాధారణం. శరీర నొప్పులు, జుట్టు రాలడం కూడా దీని ఏర్పడే అవకాశం ఉంది. విటమిన్ డి లోపం ప్రోస్ట్రేట్, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్‌తో సహా మానవులలో క్యాన్సర్‌లకు కూడా కారణమవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులైన అధిక రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిల నియంత్రణ, గుండె జబ్బులు, అతిసారం, మూత్రాశయ సమస్యలు, పేలవమైన ఏకాగ్రత కారణంగా అధిక రక్త చక్కెర వంటి వ్యాధులు వచ్చే అవకాశంఉంటుంది".