చాట్ జీపీటీతో 30 కోట్ల ఉద్యోగాలకు ముప్పు.. అందులో మీరున్నారా..

చాట్ జీపీటీతో 30 కోట్ల ఉద్యోగాలకు ముప్పు.. అందులో మీరున్నారా..

అర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ప్రజెంట్ డేస్ లో రోజుకో వార్తతో ట్రెండింగ్ లో నిలుస్తోంది. చాట్ జీపీటీ వచ్చాక భవిష్యత్ లో ఉద్యోగులతో పని లేకుండా పోతుందని ఇప్పటికే చాలా మంది భయపడుతుండగా మరో పిడుగు లాంటి వార్త ఆందోళనకు గురి చేస్తోంది. చాట్ జీపీటీ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల(300మిలియన్ల) ఉద్యోగులను భర్తీ చేయనున్నట్టు గోల్డ్ మన్ సాక్స్ నివేదికలు చెబుతున్నాయి. మానవ ప్రమేయం లేకుండా టెక్ట్స్, ఇమేజెస్, కంటెంట్ ను రూపొందించే ఈ ప్రక్రియతో భారీ మార్పులు రావొచ్చని హెచ్చరిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో మూడింట రెండు ఉద్యోగాలు కొంత మేరకు ఆటోమేట్ చేయబడతాయని గోల్డ్‌మన్ సాచ్స్ నివేదించింది. అంతేకాదు ఇది ప్రపంచ జీడీరపీని 7 శాతం వరకు పెంచవచ్చని తెలిపింది. ఏఐ వల్ల ముఖ్యంగా కొన్ని వృత్తులు ప్రభావితం కావొచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ఆఫీస్, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు 46 శాతం ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు

ChatGPT కోడర్‌లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, అడ్వర్టైజింగ్, జర్నలిజం, కంటెంట్ క్రియేషన్, పారాలీగల్‌లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్‌లు మొదలైన ఉద్యోగాలను భర్తీ చేసే ప్రమాదం ఉంది. వారితో పాటు జర్నలిస్టులు, రచయితలు, వెబ్, డిజిటల్ ఇంటర్‌ఫేస్ డిజైనర్లు, ఫైనాన్షియల్ కాంటిటేటివ్ విశ్లేషకుల, వార్తా విశ్లేషకులు లాంటి ఉద్యోగులకు ముంచు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.