V6 News

RIL Industries: నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ..షేర్ హోల్డర్స్ ఆమోదం

RIL Industries: నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ..షేర్ హోల్డర్స్ ఆమోదం

రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ నియమకానికి దాని షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. అవసరమైన దానికంటే ఎక్కువ మెజారిటీతో  నియామకానికి సంబంధించిన తీర్మానాలు ఆమోదించబడ్డాయి అని రిల్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. 

పోలైన మొత్తం ఓట్లలో ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ లకు వరుసగా 98.2శాతం, 98.6 శాతం, 92.76 శాతంతో ఆమోదం పొందారు. అయితే ఆగస్టులో నే వీరి నియామకాలకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో నాయకత్వ మార్పులో తదుపరి పెద్ద దశగా గుర్తించబడింది. 

ALSO READ:-పాకిస్తాన్లో 500 విమానాలు క్యాన్సిల్..