లష్కరేను టెర్రర్ లిస్టులోకి చేర్చిన ఇజ్రాయెల్

లష్కరేను టెర్రర్ లిస్టులోకి చేర్చిన ఇజ్రాయెల్

న్యూఢిల్లీ: ముంబైపై టెర్రర్ అటాక్స్ జరిగి15 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా  ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తయిబాను తమ దేశంలోని టెర్రరిస్ట్ గ్రూపుల లిస్టులో చేర్చుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం మన దేశంలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. “ముంబైలో టెర్రర్ అటాక్స్ జరిగి 15 ఏండ్లు(26/11) పూర్తికానున్నాయి. ఆ దాడుల జ్ఞాపకార్థం లష్కరే తయిబాను మేం టెర్రరిస్ట్ సంస్థల జాబితాలో చేర్చుతున్నాం.

ఇలా చేర్చాలని భారత్ మమ్మల్ని అభ్యర్థించనప్పటికీ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత పౌరులతోపాటు వందలాది మందిని లష్కరే సంస్థ చంపేసింది. 2008 నవంబర్ 26 నాటి ముంబై దాడిని ప్రపంచ శాంతి కోరుకునే దేశాలు ఇంకా మరిచిపోలేదు. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇజ్రాయెల్ తన సానుభూతిని తెలియజేస్తున్నది.” అని ఇజ్రాయెల్ ఎంబసీ వివరించింది.