మళ్లీ మొదలైంది.. గంటల వ్యవధిలోనే 178మంది హతం

మళ్లీ మొదలైంది.. గంటల వ్యవధిలోనే 178మంది హతం

ఒక వారం సంధి తర్వాత డిసెంబర్ 1న గంటల వ్యవధిలోనే గాజా స్ట్రిప్‌లోని ఇళ్లు, భవనాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 178 మంది మరణించారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్.. హమాస్ లోని 200ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను జరిపినట్లు చెప్పింది. గాజాలోని ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి రాకెట్లను కాల్చడంతో ఈ దాడిని మళ్లీ ప్రారంభించారు. దీంతో లెబనాన్‌తో ఉత్తర సరిహద్దులో పనిచేస్తున్న ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఉగ్రవాదుల మధ్య పోరాటం జరిగింది. ఈ క్రమంలో సంధిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మధ్యవర్తి ఖతార్ తెలిపారు.

ఇజ్రాయెల్.. గాజాలో చాలా వరకు సైనిక కార్యకలాపాలను నిలిపివేసింది. ఉగ్రవాదుల చేతిలో ఉన్న 100 మందికి పైగా బందీలను విడుదల చేయడానికి బదులుగా 300 మంది పాలస్తీనా ఖైదీలను విడిపించింది. అందులో 115 మంది పురుషులు, 20 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఇప్పటికీ హమాస్ ఆధ్వర్యంలో బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ పాలనలో ఉన్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, సంధి ముందు వరకు 13వేల 300 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 12వందల మంది ఇజ్రాయెలీలు మరణించారు.