బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు ( నవంబర్ 2 ) శ్రీహరికోటలో LVM3-M5 ప్రయోగం..

బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు ( నవంబర్ 2 ) శ్రీహరికోటలో LVM3-M5 ప్రయోగం..

శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం ( నవంబర్ 2 ) సాయంత్రం 5:26 గంటలకు LVM3-M5 రాకెట్ ప్రయోగించనున్నారు. ఈ క్రమంలో 24 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగనుంది. ఆ తర్వాత సరిగ్గా సాయంత్రం 5:26 గంటలకు నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగికి ఎగరనుంది. 

ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ దగ్గర రాకెట్ లాంచింగ్ రిహార్సల్స్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు శాస్త్రవేత్తలు.

వాతావరణం అనుకూలిస్తే.. శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో సైంటిస్టులు షార్ నుండి ఇప్పటివరకు ఇంత బరువు కలిగిన శాటిలైట్ ను పంపడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. ఇస్రో మరో మైలురాయిని చేరుకుంటుందని చెప్పాలి. 

►ALSO READ | హిందీ, సంస్కృత భాషలకు స్పెషల్ గ్రాంట్స్.. ఇతర భాషలపై నిర్లక్ష్యం: కేంద్రంపై సీఎం ఫైర్

43.5 మీటర్ల పొడవున్న  LVM3-M5 రాకెట్ ప్రారంభ సమయంలో 642 టన్నుల బరువుతో నింగికి ఎగరనుంది. LVM3-M5 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ సమయం ముగిసేసరికి రాకెట్ రెండువైపులా ఉన్న ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్స్ మండి 642 టన్నుల బరువున్న రాకెట్ భూమి నుంచి నింగికి దూసుకెళ్లనుంది.