ఇవాళ రాత్రికి నింగిలోకి జీఎస్ఎల్వీ 3 ప్రయోగం

ఇవాళ రాత్రికి నింగిలోకి జీఎస్ఎల్వీ 3 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి రెడీ అయ్యింది. ఏపీలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ రాత్రి 12 గంటల 7 నిమిషాలకు GSLV-3ను  ప్రయోగించనున్నారు.  శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్న రాత్రి 12 గంటల 7 నిమిషాల నుంచి మొదలైన కౌంట్ డౌన్ కొనసాగుతోంది. 24 గంటల కౌంట్ డౌన్ పూర్తైన తర్వాత ఇవాళ రాత్రికి జీఎస్ఎల్వీ 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. 

ఒకేసారి 36  కమర్షియల్ ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపనున్నారు. 5 వేల 200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన శాటిలైట్లను రోదసీలోకి పంపిస్తున్నారు. రాకెట్ స్పెస్ సెంటర్ నుంచి ప్రారంభించిన తర్వాత.. 16 నిమిషాల 21 సెకన్లలో శాటిలైట్స్ ను లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనుంది.  NSIL తో ఒప్పందం తరువాత నిర్మాణం అయిన తొలి బరువైన రాకెట్  ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్ ను రూపొందించారు. 

ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్త్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉంది. ఈ టైంలో 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ బెబ్, NSIL మధ్య ఇటీవల ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కి పంపగలదు. భారత్ నుంచి నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ మార్క్-3లో... ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టడం ఎన్ఎస్ఐఎల్, ఇస్రోలకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు.