బడ్జెట్ 2020: స్పేస్​కు 13వేల కోట్ల రూపాయలు

బడ్జెట్ 2020: స్పేస్​కు  13వేల కోట్ల రూపాయలు

    ప్రస్తావన లేని గగన్​యాన్​

న్యూఢిల్లీ: స్పేస్​ డిపార్ట్​మెంట్​కు ఈ ఏడాది బడ్జెట్​ను కొంచెం పెంచింది కేంద్ర ప్రభుత్వం. రూ.13,479.47 కోట్ల రూపాయలను బడ్జెట్​లో కేటాయించింది. ఇస్రో హెడ్​క్వార్టర్స్​కు రూ.194 కేటాయించిన సర్కారు, స్పేస్​ టెక్నాలజీకి ఎక్కువ మొత్తంలో రూ.9,761.5 కోట్ల నిధులు కేటాయించింది. టెలికమ్యూనికేషన్స్​, టీవీ ప్రసారాలు, వాతావరణం, రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఇస్రో పంపిన ఇన్​శాట్​ శాటిలైట్​ సిస్టమ్​ కోసం రూ.750 కోట్లు ప్రతిపాదించింది. కేటాయించిన బడ్జెట్​లో స్పేస్​ రీసెర్చ్​ కోసం రూ.5,668 కోట్లు ఇచ్చింది. స్పేస్​ రీసెర్చ్​లో క్యాపిటల్​ ఔట్​ లే కింద రూ.7,775 కోట్లు కేటాయించింది. ఇస్రో పెట్టిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్​ ఇండియా లిమిటెడ్​కు మాత్రం ఈసారి బడ్జెట్​లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఈ ఏడాది డిసెంబర్​లో చేయబోతున్న గగన్​యాన్​ ప్రయోగం ఊసే లేదు. అయితే, భవిష్యత్​లో చేపట్టబోయే మార్స్​ ఆర్బిటర్​ మిషన్​ (మామ్​) 2, వీనస్​ మిషన్​, ఆదిత్య ఎల్​1, స్పేస్​ డాకింగ్​ ఎక్స్​పెరిమెంట్​ వంటి వాటిని మాత్రం ప్రస్తావించింది. కాగా, గత ఏడాది 12,473.26 కోట్లను కేటాయించింది కేంద్రం.

మరిన్ని వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి