ఇస్రోలో ఉద్యోగం అంటే ఎందుకు చేరటం లేదంటే.. ఛైర్మన్ క్లారిటీ

ఇస్రోలో ఉద్యోగం అంటే ఎందుకు చేరటం లేదంటే.. ఛైర్మన్ క్లారిటీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో ఎన్నో ప్రపంచ విజయాలకు ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ చాలా మంది ఐఐటీయన్స్ ఇస్రోలో చేరేందుకు ఆలోచిస్తారని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ S. సోమనాథ్ చెప్పారు. ఐఐటీలో రిక్రూట్‌మెంట్ సెషన్‌లో 60% మంది విద్యార్థులు ఇస్రో అందించే గరిష్ట జీతం గురించి తెలుసుకుని వెనుదిరిగిన సంఘటనను ఆయన హైలెట్ చేసి చెప్పారు.

అంతరిక్షాన్ని ఒక ఆవశ్యక రంగంగా భావించే వ్యక్తుల్లో కేవలం 1% మంది మాత్రమే ఇస్రోలో చేరాలని నిర్ణయించుకున్నారని చైర్మన్ నొక్కి చెప్పారు. ఏజెన్సీ అద్భుతమైన చరిత్ర, పలు విజయాలు కలిగి ఉన్నప్పటికీ, చాలా మంది ప్రతిభావంతులైన నిపుణులు ప్రత్యామ్నాయ వృత్తి మార్గాలను ఇష్టపడుతున్నారు, ఇది ప్రతిభ అంతరానికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ ఆందోళన కొత్తదేం కాదని.. కానీ ఇటీవలి కాలంలో ఇస్రో ఉద్యోగుల జీతాల నిర్మాణంపై చర్చలు ఊపందుకున్నాయని చెప్పారు.

ముఖ్యంగా వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్‌ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ నెల వేతనం కేవలం రూ. 2.5 లక్షలేనని వెల్లడించారు. ఆ వేతనం న్యాయమైదేనా? అని ఆయన ప్రశ్నించారు. వేతనం కన్నా సైన్స్ అండ్ రీసెర్చ్ రంగంలో ఆయనకున్న ఆసక్తిని, తపనను గుర్తించాలన్నారు.