విక్రమ్​పై ఆశ పోలేదు..మళ్లీ ప్రయత్నిస్తాం

విక్రమ్​పై ఆశ పోలేదు..మళ్లీ ప్రయత్నిస్తాం

చంద్రయాన్​ 2 ల్యాండర్​ విక్రమ్​పై ఇస్రో ఇంకా ఆశలు వదులుకోలేదు. విక్రమ్​ను తిరిగి లైన్​లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ‘‘ప్రస్తుతం విక్రమ్​ను దారిలోకి తేవడం కుదరదు. ఇప్పుడు చందమామపై చీకటి ఉంది. కొద్ది రోజుల తర్వాత సూర్యుడు వస్తాడు. అప్పుడు మళ్లీ విక్రమ్​తో కమ్యూనికేట్​ చేయడానికి ప్రయత్నిస్తాం” అని ఇస్రో చైర్మన్​ కె. శివన్​ చెప్పారు. అయితే, ఇప్పుడు విక్రమ్​ను తిరిగి దారిలోకి తేవడం చాలా కష్టమని కొందరు ఇస్రో అధికారులు అంటున్నారు. హార్డ్​ ల్యాండ్​ అయిన ఇన్నాళ్లకు దాన్ని మళ్లీ లింక్​ చేయడమంటే చాలా కష్టమైన పని అని అభిప్రాయపడుతున్నారు. చలి వాతావరణంతో పాటు, చందమామను బలంగా విక్రమ్​ ఢీకొట్టిందని, దాని ప్రభావమూ ఉంటుందని అన్నారు. దాని ప్రభావంతో ల్యాండర్​ లోపల సాఫ్ట్​వేర్లతో పాటు చాలా వస్తువులు దెబ్బ తిని ఉంటాయని అన్నారు.