చంద్రయాన్ 3 మిషన్పై ఇస్రో కీలక అప్డేట్.. విక్రమ్, ప్రజ్ఞాన్ రీయాక్టివేట్ ప్రక్రియ కొనసాగుతుంది: ఇస్రో

చంద్రయాన్ 3 మిషన్పై ఇస్రో కీలక అప్డేట్..  విక్రమ్, ప్రజ్ఞాన్ రీయాక్టివేట్ ప్రక్రియ కొనసాగుతుంది: ఇస్రో

చంద్రయాన్ 3 మిషన్ పై ఇస్రో కీలక అప్ డేట్ ను వెల్లడించింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మేల్కొలిపే పరిస్థితిని తెలుసుకునేందుకు వాటితో కమ్యూనికేషన్ ప్రయత్నాలు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇప్పటివరకు వాటిను ఎలాంటి సంకేతాలు అందలేదు. విక్రమ్ ల్యాండర్,  ప్రజ్ఞాన్ రోవర్ ను రీయాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నామని ఇస్రో ట్వీట్ లో తెలిపింది.

14 రోజుల తర్వాత చంద్ర రాత్రి తర్వాత.. తిరిగి ఇవాళ (సెప్టెంబర్ 22) చంద్రుని ఉపరితలంపై సూర్యోదయం కానున్న నేపథ్యంలో.. స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్లను మేల్కొలిపే  ప్రక్రియను  ఇస్రో సాయంత్రం ప్రారంభించానుకుంది.  సూర్యోదయం అయితే విక్రమ్ ల్యాండర్,  ప్రజ్ఞాన్‌ రోవర్లు సూర్యరశ్మిని వినియోగించుకోవడం ద్వారా కమ్యూనికేషన్లను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని.. కావాల్సిన ఉష్ణోగ్రత కంటె ఎక్కువ వేడెక్కడానికి వేచి చూస్తోంది. ఇవాళ సాయంత్రం విక్రమ్,   ప్రజ్ఞాన్‌లను మళ్లీ యాక్టివేట్ చేయాలనేది ఇస్రో సంకల్పించింది. 
ఈ నేపథ్యంలో శనివారం (సెప్టెంబర్ 22) సాయంత్రం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మేల్కొలిపే పరిస్థితిని తెలుసుకునేందుకు వాటితో కమ్యూనికేషన్ ప్రయత్నాలు చేసింది. అయితే వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు.. విక్రమ్ ల్యాండర్,  ప్రజ్ఞాన్ రోవర్ ను రీయాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నామని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.