
తిరుపతి: 2025 జనవరిలో 100 రాకెట్ ప్రయోగాల అరుదైన మైలురాయిని అందుకున్న ఇస్రో.. తర్వాతి రాకెట్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. 2025, మే 18న (ఆదివారం) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ -సీ61ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (ఈఓఎస్) రిశాట్-18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం (మే 17) ఉదయం 7.59 గంటలకు ఈ మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది.
ALSO READ | ఐదేండ్లలో సైన్యం కోసం 52 ఉపగ్రహాలు
నిరంతరాయంగా 22 గంటలపాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఉపగ్రహంలోని అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాలు దేశం నిఘా, పర్యవేక్షణ కార్యకలాపాలను మెరుగుపరచనున్నాయి. ఇది సీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో భూభాగాన్ని, సరిహద్దులను నిశితంగా పరిశీలించనుంది. రీశాట్ సిరీస్లో ఏడవది అయిన 1,710 కేజీలు ఉండే EOS-09 ఉపగ్రహాన్ని 529కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇది భారత రక్షణశాఖకు వెన్నుదన్నుగా నిలవనుంది.