
- ఇస్రో సైంటిస్ట్ శేషగిరి రావు
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు విస్తరిస్తున్న తరుణంలో స్పేస్‌టెక్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరిగిందని, కొత్త ఆలోచనలతో వచ్చే వారికి అపార అవకాశాలు ఉన్నాయని ఇస్రో సైంటిస్ట్శేషగిరి రావు తెలిపారు. పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్శిటీ స్కూల్‌ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం 'ఇన్నోవేటివ్ ట్రెండ్స్ఇన్స్పేస్టెక్ఇండస్ర్టీ' అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేషగిరి రావు మాట్లాడుతూ..
న్యూ స్పేస్ సిస్టం ప్రారంభమైనప్పటి నుంచి పేలోడ్, లాంచర్, ల్యాండర్సెగ్మెంట్లలో కీలక ఆవిష్కరణలు వచ్చాయన్నారు. భారత స్పేస్ టెక్ మార్కెట్2030 నాటికి 26 శాతం పెరిగి నికరంగా 77 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. 2022 వరకు 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో దాదాపు 204 స్పేస్ స్టార్టప్‌లు పనిచేస్తూ గణనీయ వృద్ధి రేటును సాధించాయని పేర్కొన్నారు.
శాటిలైట్ఐవోటీ, అడ్వాన్స్డ్ గ్రౌండ్ సిస్టమ్స్, ఏఐ, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్లాంటి టెక్నాలజీలతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్, స్పేస్టూరిజం, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాలు మరింత పెరగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ఈశ్వరయ్య, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.