రాకెట్ ఇంజిన్ టెక్నాలజీలో ఇస్రో పురోగతి..C-C నాజిల్ పరీక్ష సక్సెస్.

రాకెట్ ఇంజిన్ టెక్నాలజీలో ఇస్రో పురోగతి..C-C నాజిల్ పరీక్ష సక్సెస్.

ఇస్రో చరిత్రలో మరో విజయం. రాకెట్ ఇంజిన్ టెక్నాలజీలో పురోగతిని సాధించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ద్వారా ఈ కార్బన్ కార్బన్ నాజిల్ ను విజయవంతంగా పరీక్షించారు. ఇది థ్రస్ట్ లెవెల్స్, పేలోడ్ కెపాసిటీతో సహా రాకెట్ ఇంజన్ల క్లిష్టమైన పారామితులను అభివృద్ధి చేసేందుకు సెట్ చేయబడింది. 

కేరళలోని తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ లో అడ్వాన్స్డ్ కార్బన్-కార్బన్ మిశ్రమాలను ఉపయోగించి ఈ నాజిల్ ను తయారు చేసినట్లు ఇస్రో పేర్కొంది.

సీసీ నాజిల్ ప్రత్యేకతలు 

CC నాజిల్ .. సిలికాన్ కార్బైడ్ తో చేసిన పూతను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ జరిగే సమయంలో మెరుగ్గా పనిచేసేందుకు సహాయ పడుతుంది. ఇది వేడి, తుప్పు నుంచి రక్షణగా ఉంటుంది. కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దీనిని ఇస్రో ప్రధాన రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లో ఉపయోగిస్తారు. ప్రస్తుతం PSLV  లో PS4 దశలో కొలంబియం మిశ్రమం అని పిలువబడే లోహంతో తయారు చేసిన నాజిల్ లను ఉపయోగిస్తున్నారు.

PSLV  రాకెట్ లో సీసీ నాజిల్ లను ఉపయోగిస్తే రాకెట్ బరువు 67 శాతం తేలికగా అవుతుంది. ఈ మార్పు పీఎస్ ఎల్ వీ అంతరిక్షంలోకి 15 కిలోల ఎక్కువ పేలోడ్ ను మోసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఇది మిషన్లలో అతిపెద్ద పురోగతి. 

CC నాజిల్ ను మార్చి 19, 2024న తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రోపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ (HAT) లో 60 సెకన్ల పాటు పరీక్షించారు. ఈ పరీక్షలో సిస్టమ్ బాగా పనిచేస్తుందని , హార్డ్ వేర్ బలంగా ఉందని తేలింది. ఏప్రిల్ 2, 2024న మరోసారి పరీక్షించారు. 200 సెకన్ల పాటు హాట్ టెస్ట్ తో పాటు తదుపరి పరీక్షలు , నాజిల్ సామర్థ్యాలను మరోసారి చెక్ చేశారు.