* ఎల్వీఎం 3 జర్నీ.. 207 టన్నుల ప్రొపెల్లెంట్‌ను మోసుకెళ్లే ఎస్200 అని పిలిచే రెండు సాలిడ్ బూస్టర్లు ఒకేసారి మండటంతో ప్రారంభమవుతుంది. ఈ బూస్టర్లు 127 సెకన్ల పాటు మండుతాయి. సగటున 3,578.2 కిలో న్యూటన్‌ల థ్రస్ట్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. గరిష్టంగా ఒక్కో థ్రస్ట్ 5,150 కిలో న్యూటన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ థ్రస్ట్ రాకెట్‌ను ఆకాశం వైపు దూసుకెళ్లేలా చేస్తుంది. దీంతో ప్రయోగం మొదటి దశ పూర్తవుతుంది.
* లాంచ్ వెహికల్ నుంచి సాలిడ్ బూస్టర్స్ సెపరేట్ అయిన తర్వాత రెండో దశ ప్రారంభం అవుతుంది. ఈదశలో ఎల్110 లిక్విడ్ స్టేజ్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 110 మెట్రిక్ టన్నుల ఫ్యూయెల్‌ను కలిగి ఉండే లిక్విడ్ ఫ్యూయెల్ ఇంజిన్. ఇది రెండు వికాస్ ఇంజిన్ల ద్వారా శక్తి పొందుతుంది. ఒక్కోటి 766 కిలో న్యూటన్‌ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 1,532 కిలో న్యూటన్‌ల థ్రస్ట్‌ని ఇస్తుంది.
* ఎల్110 కోర్ స్టేజ్ లిఫ్టాఫ్ తర్వాత 108 సెకన్లలో మండటం ప్రారంభమవుతుంది. 203 సెకన్ల పాటు బర్న్ కావడంతో వెహికల్ వేగం పుంజుకుంటుంది.
* లిక్విడ్ స్టేజ్ సెపరేషన్తో మూడో దశ ముగుస్తుంది. ఈ దశలో సీఈ25 క్రయోజెనిక్ స్టేజ్ యాక్టివేషన్ జరుగుతుంది. సీ25 క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ 4 మీటర్ల వ్యాసంతో, 13.5 మీటర్ల పొడవుతో ఉంటుంది. అదేవిధంగా, 28 మెట్రిక్ టన్నుల ప్రొపెల్లెంట్ ఎల్వోఎక్స్, ఎల్‌హెచ్2లను కలిగి ఉంటుంది. ఇది 200 కిలో న్యూటన్ థ్రస్ట్‌ను ప్రొడ్యూస్ చేసే సీఈ20 ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది.
* మొత్తం 48 రోజుల ప్రయాణం తర్వాత ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కావచ్చని ఇస్రో సైంటిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.