శాటిలైట్ తో అంతరిక్షంలోకి మోడీ, భగవద్గీత ఫొటో

శాటిలైట్ తో అంతరిక్షంలోకి మోడీ, భగవద్గీత ఫొటో

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకుంటూ వెళ్తోంది. భారతదేశం గర్వించదగ్గ స్థానానికి చేరుకుంది. తక్కువ ఖర్చుతో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ISRO ను స్థాపించి ఐదు దశాబ్దాలు అయిన సమయంలో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన సైంటిస్టులు అంతరిక్షంలోకి ఓ శాటిలైట్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోతో పాటు భగవద్గీతను… మరో 25 వేల మంది పౌరుల పేర్లను పంపాలని నిర్ణయించారు. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వారు మాత్రమే కాకుండా.. అవార్డులను అందుకున్న వారు కూడా ఉన్నారని తెలిపారు.

ఈ నెల 28న PSLV C-51 ను ప్రయోగించనున్న ఇస్రో… దాని ద్వారా అమెజానియా-1తో పాటు ఇండియన్ ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన ఆనంద్, యునిటీశాట్, సతీశ్ ధావన్ ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపనుంది. ఆనంద్ ను కర్ణాటకకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘పిక్సెల్’ దీన్ని తయారు చేసింది. దీనితో పాటే సతీశ్ ధావన్ పేరుతో తయారైన ఉపగ్రహాన్ని స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించింది. వీటితో కోయంబత్తూరు కాలేజీ విద్యార్థులు తయారు చేసిన శ్రీశక్తి శాట్ం నాగపూర్ సైంటిస్టులు తయారు చేసిన GHRCE శాట్ తదితరాలు కూడా తమ తమ కక్ష్యల్లోకి వెళ్లనున్నాయి.

ఈ రాకెట్ ను 28వ తేదీ ఉదయం 10.24 గంటలకు PSLV C-51  వాహక నౌక ద్వారా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు సైంటిస్టులు.