
నిఖిల్ ‘స్పై’ సినిమాతో ఐశ్వర్య మీనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ నాజూకు అందం సినీ పరిశ్రమకు పరిచయమై పదేళ్లు దాటిందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. కోలీవుడ్‌లో ఇన్నేళ్లుగా హీరోయిన్ గా ఉన్న ఐశ్వర్య కేవలం పది సినిమాల్లోనే నటించింది. అవి కూడా ఆమెకు గుర్తింపునివ్వలేదు. దీంతో తన ఆశలన్నీ స్పై సినిమాపైనే పెట్టుకుంది. ఇవాళ ఈ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఈ బ్యూటీ గ్లామర్, నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. దీంతో టాలీవుడ్లో ఐశ్వర్య నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటా అనే విషయం ఆసక్తిగా మారింది. ఇతర పరిశ్రమల్లో నుంచి ఎంతో మంది ఇక్కడ లక్ ను పరీక్షించుకుంటారు. కానీ, కొందరు మాత్రమే సక్సెస్ అందుకుంటారు. మరి ఐశ్వర్య ఏ కోవలోకి చెందుతుందో తెలియాంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.