తాత.. మనవడు.. ఓ మేక

తాత.. మనవడు.. ఓ మేక

పలు సూపర్ హిట్ చిత్రాలతో నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న  స్రవంతి రవి కిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు.  పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో  ‘దీపావళి’ పేరుతో విడుదల చేస్తున్నారు.  నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌‌‌‌ చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది.