మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు సోదాలు.. 8 కోట్లు సీజ్!

మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు సోదాలు.. 8 కోట్లు సీజ్!
  • కుటుంబ సభ్యుల ఇండ్లలోనూ తనిఖీలు
  • 8 బ్యాంకుల్లో 12 లాకర్ల గుర్తింపు
  • మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రెండు డిజిటల్ లాకర్లు సీజ్! 
  • ఇయ్యాల కూడా సోదాలు కొనసాగే చాన్స్  
  • నా కొడుకును కొట్టిన్రు.. ఎలాంటి దాడులకూ భయపడం: మల్లారెడ్డి 

హైదరాబాద్‌‌/జీడిమెట్ల/సికింద్రాబాద్‌‌, వెలుగు: మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లు, వ్యాపార సంస్థలపై బుధవారం రెండోరోజు కూడా ఇన్ కమ్ ట్యాక్స్ (ఐటీ) డిపార్ట్ మెంట్ దాడులు జరిగాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. గురువారం కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. రెండ్రోజులు జరిగిన సోదాల్లో ఐటీ అధికారులు మొత్తం రూ.8.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 8 బ్యాంకుల్లో 12 లాకర్స్ గుర్తించినట్లు సమాచారం. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌‌‌‌ రెడ్డి ఇంట్లో రెండు డిజిటల్ లాకర్స్‌‌ సీజ్ చేసినట్లు తెలిసింది. రాజశేఖర్‌‌ ‌‌రెడ్డి టర్కీలో ఉండడంతో ఆయన కూతురు శ్రేయారెడ్డితో వాటిని ఓపెన్ చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. 

అయితే ఓపెన్ కాకపోవడంతో లాకర్లను సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇంట్లో ఉన్న వారికి నోటీసులు అందజేశారు. అలాగే కోఠిలోని ఎస్ బీఐ బ్యాంకులో రాజశేఖర్ రెడ్డికి చెందిన లాకర్లు ఉండడంతో శ్రేయారెడ్డిని అక్కడికి తీసుకెళ్లి వాటిని ఓపెన్ చేసి పరిశీలించారు. పన్ను ఎగవేత ఆరోపణలతో మంత్రి మల్లారెడ్డి గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ కంపెనీల్లో మంగళవారం సోదాలు ప్రారంభించిన ఐటీ.. బుధవారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మల్లారెడ్డి ఇల్లు, ఆయన అల్లుడు రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కొంపల్లిలోని కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, బంధువులు ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సంతోష్​ రెడ్డి ఇండ్లలో తనిఖీలు చేసింది. బాలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్రాంతి కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్, సూరారంలోని మల్లారెడ్డి- నారాయణ ఆసుపత్రిలోనూ సోదాలు జరిపింది. సంతోష్​​రెడ్డి ఇంట్లో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిసింది. శంషాబాద్​లోని రాజశేఖర్​రెడ్డికి చెందిన వర్ధమాన్​ కాలేజీలోనూ ఐటీ సోదాలు చేసింది.

ఆరేండ్ల లెక్కలు తీస్తున్నరు.. 

అధికారులు రెండ్రోజుల సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న కంపెనీలు, వాటి ఆర్థిక లావాదేవీలను సేకరించారు. అందులో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. గత ఆరేండ్లుగా ఆయా కంపెనీలు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చెల్లింపులో నిబంధనలు పాటించలేదని ఆధారాలుసేకరించినట్లు తెలిసింది. నగదు రూపంలో పెట్టుబడులు పెట్టారని, లెక్కలు లేకుండానే రూ.కోట్లు చేతులు మారాయని గుర్తించినట్లు సమాచారం. వీటికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో రూ.కోట్లలో పన్ను ఎగవేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, మరో 10 మంది ఎడ్యుకేషన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్స్, కంపెనీలు నిర్వహిస్తున్నట్లు ఐటీ ఆధారాలు సేకరించింది. సేవా కార్యక్రమాలతో కూడా ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగవేతకు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీలు చేపట్టిన సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థల వివరాలు సేకరిస్తోంది. వీటి ఆధారంగా నోటీసులు ఇచ్చి వివరణ కోరనుంది. సీజ్ చేసిన క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి సంబంధిత వ్యక్తులను విచారించనుంది. ఆయా సంస్థల చార్టెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంటెంట్స్, ఆడిటర్లతో స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనుంది. 

క్రాంతి బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే లావాదేవీలు! 

బాలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్రాంతి కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకులోనే మల్లారెడ్డి సంస్థలకు చెందిన అకౌంట్స్ ఉన్నట్లు ఐటీ గుర్తించింది. ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలు సహా రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలకు చెందిన ఆర్థిక లావాదేవీలు క్రాంతి బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే జరిగినట్లు ఐటీ అనుమానిస్తోంది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో కాకుండా క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగినట్లు ఆధారాలు సేకరించింది. ఇందుకోసం మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఇండ్లలోనే నగదు నిల్వ చేసే వారని గుర్తించినట్లు తెలిసింది. రూ.వందల కోట్లు డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుండా, ఇన్ కమ్ ట్యాక్స్ సహా ఇతర టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చెల్లించకుండా హవాలా రూపంలో తరలించినట్లు ఐటీ అనుమానిస్తోంది. 

నేను క్యాసినోలు నడుపుతలేను

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. 200 మంది ఐటీ అధికారులతో మాపై దాడి చేయిస్తున్నది. నాతో పాటు నా కుటుంబ సభ్యులను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ పోలీసులు నా కొడుకును కొట్టారు. నేను హవాలా వ్యాపారం చేయడం లేదు. క్యాసినోలు నడిపించట్లేదు. ప్రజాసేవ చేస్తున్నాను. విద్యార్థులకు చదువు చెప్పి మంచి డాక్టర్లు, ఇంజినీర్లలను తయారు చేయడం తప్పా? మాకు సబంధం లేని వ్యక్తుల వద్ద దొరికిన డబ్బులు కూడా మావే అంటున్నారు. ఎలాంటి దాడులు చేసినా మేము భయపడం. అన్ని లెక్కలు ఉన్నాయి. లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే  డాక్యుమెంట్స్ అందిస్తాం. - మల్లారెడ్డి, మంత్రి 

మల్లారెడ్డి కొడుకుకు అస్వస్థత.. 

తన ఇంట్లో సోదాలు జరుగుతున్న టైమ్ లో మల్లారెడ్డి కొడుకు మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆయనను సూరారంలోని మల్లారెడ్డి-–నారాయణ ఆస్పత్రికే తరలించారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి.. ఆస్పత్రికి వెళ్లారు. ఐటీ అధికారులు, సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. అదే సమయంలో మల్లారెడ్డి మరదలు కొడుకు ప్రవీణ్ రెడ్డి కూడా అస్వస్థతకు గురయ్యారు. మల్లారెడ్డే వెళ్లి ఆయనను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తీసుకొచ్చారు. ట్రీట్ మెంట్ అందించి ప్రవీణ్ రెడ్డిని డిశ్చార్జి చేయగా, మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. మంత్రి ఇంట్లో పని చేసే రమ కూడా అస్వస్థతకు గురికాగా, ఆమెకు ట్రీట్ మెంట్ అందించి డిశ్చార్జి చేశారు. ఈ మేరకు మల్లారెడ్డి కోడలు, ఆస్పత్రి డైరెక్టర్ ప్రీతిరెడ్డి తెలిపారు. కాగా, ఐటీ సోదాలు జరుగుతున్న టైమ్ లో మల్లారెడ్డి ఇంటి వద్ద, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్సీలు శంభీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజు, రమణ, ఎమ్మెల్యే వివేకానంద్ సహా టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చేరుకున్నారు.